పది వేలు,  పాతిక వేలు పెట్టి కొనుక్కున్న సెల్ ఫోన్ పోతేనే లబో దిబో అని మొత్తుకుంటుంటాము. దొరకదని తెలిసినా నానా హంగామా చేసి రెండు మూడు రోజులు తెగ ఆరాటపడిపోతాము. అలాంటిది కొన్ని కోట్ల విలువైన వస్తువు పోవడం అంటే గుండె బద్దలైపోవాల్సిందే. అలాంటి విలువైన వస్తువు మళ్ళీ దొరికిందంటే పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందో లేదో తెలీదు గాని ప్రాణం తో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక్క క్షణం గుండే ఆగిపోతుంది. 1917వ సంవత్సరంలో గుస్తవ్ క్లిమ్ట్ అనే ఆర్టిస్టు వేసిన ఒక అమ్మాయి ఆర్ట్ ను భారీ మొత్తానికి ఇటలీలోని రిచ్చీ ఆడీ గ్యాలరీ సొంతం చేసుకుందట. ఆ ఆర్ట్ కు ఉన్న ప్రత్యేకతతో భారీ మొత్తం లో డబ్బు చెల్లించి ఆ ఆర్ట్ ని రిచ్చీ ఆడీ గ్యాలరీ దక్కించుకుందట. చాలా సంవత్సరాల వరకు రిచ్చీ ఆడీ గ్యాలరీలోనే ఆ ఆర్ట్ ఉందట. అయితే దాదాపు పాతిక సంవత్సరాల క్రితం అంటే 1997లో ఆ ఆర్ట్ కనిపించకుండా పోయిందట. పోలీసు కేసు నమోదు అవ్వడంతో పాటు చట్టపరమైన,  ప్రభుత్వపరమైన చర్యలు కూడా తీసుకున్నప్పటికి ఆర్ట్ ఎక్కడ ఉందో ఎవరు తెలుసుకోలేపోవడం గమనర్హం.

 

ఇక ఆ ఆర్ట్ గురించి అందరూ మర్చిపోతున్న సమయంలో ఇప్పుడు ఆ ఆర్ట్ దొరికి సంచలనం అయింది. అది కూడా ఏదో ప్రాంతంలోనో లేదంటే మరేదో దేశంలోనో కాదు. అదే ఆర్ట్ గ్యాలరీ బయట ఒక గోడ సందులో కనిపించిందట. ఇప్పుడు ఈ సంఘటన సంచలనంగా మారింది. రీసెంట్‌గా ఆ చుట్టు పక్కల ప్రాంతం క్లీన్ చేసే స్వీపర్ ఆ ప్రాంతం క్లీన్ చేస్తున్న సమయంలో గోడపై ఉన్న ఆకులను తొలగించేందుకు అతను ఊడుస్తున్నాడట. ఆ సమయంలోనే ఏదో వస్తువు ఉన్నట్లుగా అతను గుర్తించి మెల్లగా అదేమిటోనని బయటకు తీశాడట. అందులో ఒక ఆర్ట్ ఉండటం చూసి తన ఉన్నతాధికారులకు తెలియజేశాడు.

 

ఆ ఆర్ట్ ను చూసిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారట. పాతిక సంవత్సరాల క్రితం మిస్ అయిన ఆ ఆర్ట్ ఇప్పుడు కనిపించడం.. అది కూడా అదే ఆర్ట్ గ్యాలరీలో ఉండటంతో వారు షాక్ కి గురయ్యారట. ప్రస్తుతం ఆ ఆర్ట్ 51 మిలియన్ ఫౌండ్ల రేటు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 471 కోట్ల రూపాయల విలువ ఉందట. అంతటి ఖరీదైన ఆ ఆర్ట్ ను ఎవరు అక్కడ ఉంచారు.. అందుకు సంబంధించిన కారణాలు ఏంటీ అనేది ప్రస్తుతం గ్యాలరీ అధికారులు విచారిస్తున్నారు. చాలా ఖరీదైన ఆర్ట్ కాబట్టి ఇటలీలోని సెంట్రల్ బ్యాంక్ లాకర్ లో ఉంచినట్లుగా తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: