భారతదేశం వీరులకు  నిలయం. ఎంతోమంది వీరలు  భరత మాత ఒడిలో ప్రాణాలు వదిలారు. ఉరికొయ్యల ను ఉయ్యాలలుగా  భావించి భరతమాత సంకెళ్లను తెంచటానికి  ప్రాణాలను సైతం అర్పించారు. సర్వస్వాన్ని వదిలి పెట్టి కేవలం భారత మాత సంకెళ్ళు తెంపడానికి జీవితాలను ధారపోసిన వారు ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు. ఎంతోమంది వీరులు బ్రిటిష్ తుపాకీ తూటాలకు  ఎదురొడ్డి నిలిచి బ్రిటిషర్లకు ఎదిరించారు . ఇలాంటి మహోన్నతమైన స్వతంత్ర సమరయోధులలో ఒకరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జీవితం ఆద్యంతం ఒక సాహసంగా సాగిపోతూ ఉంటుంది. సాహసమే నా ఊపిరి అనే పదానికి నిలువెత్తు రూపం నేతాజీ సుభాస్ చంద్ర బోస్. 

 

నేతాజీ సుభాష్ చంద్రబోస్... అసలు సిసలైన భారత పౌరుషానికి మారుపేరు. జనవరి 23, 1897 సంవత్సరంలో ఈ మహానీయుడు జన్మించాడు.గాంధీజీ శాంతియుతంగా అహింసావాదం తో స్వరాజ్యం సిద్ధిస్తుందని అంటూ పోరాటం చేస్తున్న సమయంలో... సాయుధ పోరాటం తోనే ఆంగ్లేయులను భారత దేశం నుంచి తరిమి కొట్టి స్వతంత్రాన్ని సంపాదించు కోవచ్చు అని నమ్మి అది ఆచరణలో పెట్టిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. స్వతంత్ర సమరయోధులలో  ఇప్పటికీ భారత ప్రజలందరూ స్మరించుకునే స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్. జాతీయ కాంగ్రెస్ కు  రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ అహింస వాదంతో తాను పోరాటం చేయలేనని... పోరుబాట ముఖ్యమని జాతీయ కాంగ్రెస్ పదవికి రాజీనామా చేశారు సుభాష్ చంద్రబోస్. 

 

 సివిల్ సర్వీసు నుంచి వైదొలగి భారత స్వతంత్ర సంగ్రామంలో ఎంతో మంది ముందుకు నడిపించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్.గాంధీజీ తో కలిసి సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పనిచేశారు. అప్పటికీ ఆంగ్లేయులను ఎదిరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో సార్లు జైలుకు వెళ్లి వచ్చిన సుభాష్ చంద్రబోస్.. భారత సైన్యం ద్వారానే ఆంగ్లేయులను  భారత దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మాడు. భారత సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ సెప్టెంబర్ 1942  లో సింగపూర్ లో స్థాపించాడు. 1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాకతో భారత సైన్యం కొత్త ఊపిరి పీల్చుకుంది. ఒక స్వాతంత్రం లో సాయుధ పోరాటం చేద్దామని నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశభక్తుల్లో  ఉత్తేజాన్ని నింపటంతో...  ఎంతో మంది దేశ భక్తులు సైన్యంలో చేరడమే కాకుండా భారత సైన్యానికి ఆర్థిక సహాయం కూడా అందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: