జనవరి 21వ తేదీన చరిత్రలోకి వెళితే ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 త్రిపుర మేఘాలయ : 1972 జనవరి 21వ తేదీన భారత దేశ ఈశాన్య ప్రాంతంలో ఉన్న చిన్న ప్రాంతమైన మేఘాలయ రాష్ట్రంగా ఏర్పడింది. 300 కిలోమీటర్ల పొడవు 100 కిలోమీటర్ల వెడల్పు ఉన్నది మేఘాలయ రాష్ట్రం. అంతేకాకుండా భారతదేశంలోని మరో ఈశాన్య ప్రాంతం  త్రిపుర రాష్ట్రంగా ఏర్పడింది.

 

 

 పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి జననం : నెల్లూరు జిల్లాకు చెందిన పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి 1915 జనవరి 21వ తేదీన జన్మించారు. భూస్వామ్య కుటుంబానికి చెందిన పుచ్చల రామచంద్రారెడ్డి నెల్లూరు పట్టణంలో ప్రజా వైద్యునిగా ఎంతో పేరు గడించారు. పేద ప్రజలందరికీ ఉచిత వైద్యాన్ని అందించిన గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి  రామచంద్రారెడ్డి. ప్రముఖ కమ్యూనిస్టు నేత అయిన పుచ్చలపల్లి  సుందరయ్య తమ్ముడు ఈ  రామచంద్రారెడ్డి. ఇప్పటికీ నెల్లూరు జిల్లాలో నడుస్తున్న ప్రజావైద్యశాల  రామచంద్రారెడ్డి స్థాపించినదే . విశ్వోదయ కళాశాలలకు సహవ్యవస్థాపకుడు ఈయన . ఈయనను ఎక్కువగా డాక్టర్ రామ్ అని పిలిచేవారు. పేదరికాన్ని నిర్మూలించేంత వరకు పేదలకు వచ్చే రోగాలు ఆగవు  కదా అందుకే ఈ ప్రణాళికలో కొంత వైద్యం నేర్చుకొని పేదలని  కాపాడాలి అని అనుకుని వైద్య వృత్తి లోకి అడుగుపెట్టారు డాక్టర్ రామచంద్ర రెడ్డి. కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. బీడీ కార్మికుల సమ్మె,  రిక్షా కార్మికుల సమస్యల గురించి ఉద్యమాల్లో  కూడా స్వయంగా పాల్గొన్నారు డాక్టర్ రామచంద్రారెడ్డి.

 

 

 సత్య మూర్తి జననం : ఎన్నో దశాబ్దాల పాటు వ్యంగ్య చిత్రాలను ఇతర చిత్రాలను వేస్తు ఎంతో మందిని అలరించిన వ్యక్తి సత్యమూర్తి. పేరులోని సత్యమూర్తి ని  కలం పేరుగా ధరించి... తెలుగు ప్రజలందరికీ ఒక కార్టూనిస్ట్ గా  పరిచయం అయ్యారు సత్యమూర్తి. తెలుగు వ్యంగ్య చిత్ర చరిత్రలోనే ప్రసిద్ధికెక్కిన చదువుల్రావు కార్టూన్ సృష్టించినది ఈయనే.  తెలుగు కార్టూనిస్టుల లో సత్యమూర్తి ఎంతో అనుభవశాలి సీనియర్ గౌరవం పొందుతూ ఉంటారు. ఈయన 1939 జనవరి 21వ తేదీన జన్మించారు. 

 

 

 ఎండ్లూరి  సుధాకర్ జననం : 1959 జనవరి 21వ తేదీన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జన్మించారు. ఈయన విద్యాభ్యాసం వీధిబడి నుంచి విశ్వవిద్యాలయం వరకు సాగింది. తెలుగు ప్రేక్షకులందరికీ ఎన్నో రచనలు అందించారు ఆచార్య ఎండ్లూరి సుధాకర్. ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చే ఎన్నో రకాల రకాల రచనలు  కలం నుంచి జాలువారాయి. 

 

 

 కిమ్ శర్మ : బాలీవుడ్ నటి అయిన కిమ్ శర్మ ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. 1985 జనవరి 21న మహారాష్ట్ర లో జన్మించారు కిమ్ శర్మ. ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించి తనదైన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. అంతేకాకుండా తన హాట్ అందాలతో  ఎంతో మంది ప్రేక్షకుల మతి పోగొట్టారు . తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సూపర్ చితురాలే . దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి...జొర్సే జొర్సే అంటూ  తెలుగు ప్రేక్షకులందరినీ కట్టిపడేసింది శర్మ. తన అందం అభినయంతో ఎంతోమంది కట్టిపడేసిన ఈ అమ్మడు తన హాట్ హాట్ అందాలతో ఎంతోమందికి చెమటలు పట్టించింది. ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గడంతో ఎక్కడ వెండి తెరపై కనిపించడం లేదు. 

 

 

 ఈవివి సత్యనారాయణ మరణం  : తెలుగు చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ దర్శకుడు అయిన ఈవివి సత్యనారాయణ 2011 జనవరి 21వ తేదీన మరణించారు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఈయన ...గొప్ప  దర్శకుడైనా జంధ్యాల శిష్యుడు. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు ఈవీవీ  సత్యనారాయణ. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి  తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఈవీవీ సత్య నారాయణ కొడుకులైన ఆర్యన్ రాజేష్ నరేష్ కొన్ని రోజులపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు చేశారు. తనయుడు నరేష్ ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంటున్నారు. 

 

 మృణాలిని సారాభాయి మరణం : భారత సాంప్రదాయ నృత్య కళాకారిణి నృత్య దర్శకురాలు మరియు గురువు మృణాలని సారాభాయ్ . 2016 జనవరి 21వ తేదీన మృణాలిని సారాభాయి తుదిశ్వాసవిడిచారు. భారతీయ సంప్రదాయ నృత్య కళాకారిణిగా ఎంతో ప్రసిద్ధి చెందిన మహిళ మృణాలిని సారాభాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: