తాజా రాజకీయ పరిస్ధితుల్లో జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు పెద్ద సవాలే విసిరారు.  అదేమిటంటే మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతరేకంగా మాట్లాడాలని, అవసరమైతే వ్యతిరేకంగా ఓట్లు వేయాలని స్పష్టంగా చెప్పారు. రాపాకకు పవన్లేఖ కూడా రాశారు. సరే పవన్ ఎన్ని చెప్పినా రాపాక మాత్రం తాను అనుకున్నట్లే చేశారు. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు అనుకూలంగా అసెంబ్లీలో మాట్లాడారు.

 

మొత్తానికి పవన్ నేరుగా చెప్పినా  ప్రత్యేకంగా లేఖ రాసినా రాపాక ఏమాత్రం పట్టించుకోలేదు.  తన పార్టీ అధ్యక్షుడి మాట ఏమైనా ఆయన ఎటువంటి స్టాండ్ తీసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. ఎవరేమి చెప్పినా తనకు ఏది మంచిదని అనిపిస్తే అదే చేస్తానని స్పష్టంగా చెప్పారు. అంతే కాకుండా ప్రతిపక్షమైనంత మాత్రాన అధికారపార్టీ చేసే ప్రతి పనినీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబునాయుడుకు గట్టిగానే చురకలంటించారు. అంటే ఇవే చురకలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా తగులుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

మొత్తానికి రాపాక తాను అనుకున్నదే చేసేశారు. కాబట్టి తన ఆదేశాలను ఉల్లంఘించిన ఎంఎల్ఏపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి ? అన్న విషయాన్ని పవనే తేల్చుకోవాలి. ఇప్పటికే రాపాకను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కొందరు డిమాండ్లు చేశారు. గతంలో కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పవన్ వ్యతిరేకించినా రాపాక మాత్రం సస్పెండ్ చేశారు. దాన్ని పవన్ సహించలేకపోతున్నారు. అయినా ఉన్నది ఏకైక ఎంఎల్ఏ కావటంతో  అందులోను దళితుడు అవ్వటంతో  యాక్షన్ తీసుకోవటానికి జంకుతున్నారు.

 

అదే సమయంలో రాపాకపై యాక్షన్ తీసుకునేట్లు పవన్ పై కొందరు నేతలు బాగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.  ఇందులో భాగంగానే జగన్ ప్రతిపాదనపై తన స్టాండ్ ఏమిటో రాపాక ప్రకటించిన తర్వాతే పవన్  ఎంఎల్ఏకి లేఖ రాశారు. కాబట్టి ఏదో ఓ యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ పవన్ పై  ఒత్తిడి పెరిగిపోతోంది. మరి పవన్ అంత ధైర్యం చేస్తారా ? చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: