జనవరి 22వ తేదీన చరిత్రలో ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది జనాలు ఇంకెంతో మంది మరణాలు జరిగాయి. ఒక్కసారి  చరిత్రలోకి వెళితే అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం రండి. 

 

 ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ శాఖ : కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ 1918 జనవరి 22వ తేదీన ఏర్పాటయింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధనలో  ఒక మైలు రాయిగా మారిపోయింది. 

 

 బోయింగ్ 747 : 1950లో వాడుకలోకి వచ్చిన బోయింగ్ 707 విమానం కంటే రెండున్నర రెట్లు పెద్దదైన బోయింగ్ 747 విమానం 1970 22వ తేదీన వాడుకలోకి వచ్చింది. బోయింగ్ కంపెనీ తయారు చేసిన ఎక్కువ వెడల్పుగల విమానం ఇది. ప్రపంచంలోనే అతి త్వరగా కొనుగోనగలిగే విమానం ఇది. 

 

 

 సుభాష్ చంద్రబోస్ : సుభాష్ చంద్రబోస్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఓవైపు గాంధీజీ శాంతియుత పోరాటం చేస్తుంటే సాయుధ పోరాటం తోనే స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మి ఆచరణలో పెట్టిన గొప్ప యోధుడు సుభాష్ చంద్రబోస్. కాగా 1992 జనవరి 22వ తేదీన సుభాష్ చంద్రబోస్ కి  ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ నిర్ణయానికి ఉపసంహరించుకుంది ప్రభుత్వం. 

 

 

 అయ్యదేవర కాళేశ్వరరావు జననం : ప్రముఖ స్వతంత్ర సమరయోధులు అయ్యదేవర  కాళేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అయ్యదేవర కాళేశ్వరరావు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడారు. అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి శాసనసభాపతిగా  బాధ్యతలు చేపట్టారు అయ్యదేవర కాళేశ్వరరావు. 1882 జనవరి 22వ తేదీన జన్మించారు.

 

 మాడపాటి హనుమంతరావు జననం : ఆంధ్ర పితామహుడిగా పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు 1885 జనవరి 22వ తేదీన జన్మించారు. మాడపాటి హనుమంతరావు ప్రముఖ రాజకీయ నాయకుడు రచయిత. మాడపాటి హనుమంతరావు 21 వ దశకంలో హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతంలో ఆంధ్రా ఉద్యమ వ్యాప్తి చేసేందుకు కృషి చేశారు. ఆయన చేసిన కృషికి గాను ఆంధ్ర పితామహుడు అన్న బిరుదును పొందారు మాడపాటి హనుమంతరావు. 

 

 యూ థాన్ట్  జననం : ఐక్యరాజ్యసమితి యొక్క మూడవ ప్రధాన కార్యదర్శి గా విధులు నిర్వహించిన యూ థాన్ట్  1909 జనవరి 22వ తేదీన జన్మించారు. 

 

 కొండపల్లి శేషగిరిరావు జననం : తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు. 1924 జనవరి 22 సంవత్సరంలో జన్మించారు. 

 

 వేటూరి జననం : సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి 1936 జనవరి 22వ తేదీన జన్మించారు. తెలుగు ప్రేక్షకులందరికీ ఈయన వేటూరి గా సుప్రసిద్ధుడు. ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలు రాసి తెలుగు ప్రేక్షకులను అలరించారు వేటూరి. ఇప్పటికీ వేటూరి పాత్రలను తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు వేటూరి. తర్వాత కొన్ని వేల సంఖ్యలో పాటలురాసారు . ఇక ఈయన రాసిన పాటలకు గాని 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులను సొంతం చేసుకున్నారు. ఒక జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు వేటూరి. అయితే శ్రీశ్రీ తర్వాత తెలుగు పాటకు జాతీయ ఖ్యాతిని తెచ్చి పెట్టింది వేటూరియే. 

 

 

 నమ్రతా శిరోద్కర్ :  నమ్రతా శిరోద్కర్ తెలుగు ప్రేక్షకులకు తెలియని వారు కాదు. 1972 జనవరి 22న ముంబై లో జన్మించారు. వివిధ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన నమ్రతా శిరోద్కర్ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు ని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై  చెప్పేశారు నమ్రతా శిరోద్కర్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు నమ్రత లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. 

 

 

 అక్కినేని నాగేశ్వరరావు మరణం : తెలుగు చిత్ర పరిశ్రమలో  నట సామ్రాట్ గా పేరు తెచ్చుకున్న గొప్ప నటులు అక్కినేని నాగేశ్వరావు. తొలితరం కథానాయకుల్లో ఒకరు  అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో కూడా నటించారు అక్కినేని నాగేశ్వరావు. తొలినాళ్లలో అగ్ర కథానాయకుడిగా కొనసాగారు అక్కినేని నాగేశ్వరరావు. నటనలో అక్కినేని నాగేశ్వరరావు తనకు ఎవరూ సాటి లేరు అని నిరూపించారు. ఆయన 2014 జనవరి 22వ తేదీన మరణించారు.ఈయన  ఎన్నో సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: