వైసీపీ మంత్రి కొడాలి నాని అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ముందుగా సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెబుతున్నానని గత ప్రభుత్వంలాగా ప్రజల్ని భ్రమల్లో, భ్రాంతుల్లో, ఆకాశంలో విహరించకుండా వాస్తవ పరిస్థితులను కష్టమైనా, నష్టమైనా రాష్ట్ర ప్రజానికానికి చెప్పి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకుంటున్నానని ధైర్యంగా చెప్పిన వ్యక్తి జగన్ కు ధన్యవాదాలు అని అన్నారు. 
 
చంద్రబాబు తనకు సంబంధించిన డబ్బా మీడియా, చెత్త పేపర్ల ద్వారా అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందని అంటాడని చెప్పారు. ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి...? అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని అన్నారు. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రాలకు రాజధానులు మధ్యలో లేవని కొడాలి నాని ఉదాహరణలతో సహా చెప్పారు. 
 
చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రయోజనాల గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా అని కొడాలి నాని ప్రశ్నించారు. అమరావతి అనేది మోసం అని కొడాలి నాని అన్నారు. రాజులు పరిపాలించిన అమరావతి వేరని చంద్రబాబు సృష్టించిన అమరావతి వేరని కొడాలి నాని అన్నారు. ఇది చంద్రబాబు నాయుడు అమరావతి అని నాని అన్నారు. చంద్రబాబు ఇటువంటి మాటలు కట్టిపెట్టాలని కొడాలి నాని సూచించారు. 
 
రాజధాని అమరావతి వచ్చిన తరువాత కృష్ణా, గుంటూరు జిల్లాలకు కొత్తగా ఏం ప్రయోజనం చేకూరలేదని అన్నారు. రామోజీరావు, రాధాకృష్ణ పత్రికల్లో వస్తున్న వార్తలపై కొడాలి నాని విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కొడాలి నాని తీవ్రంగా తప్పుబట్టారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం గురించి లేనిపోని మాటలు మాట్లాడుతున్నారంటూ కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం బ్రతికిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొడాలి నాని ప్రశంసించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన గొప్ప పనుల వలనే జగన్ నేడు సీఎంగా ఉన్నారని కొడాలి నాని అన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం నాకు రావాలని దేవుడిని కోరుకుంటున్నానని కొడాలి నాని అన్నారు. పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడని చనిపోయినా కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నాడని అన్నారు. రాజశేఖర్ రెడ్డిది గొప్ప మరణం అని కొడాలి నాని అన్నారు. చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో ఉన్న దేవుడు రాజశేఖర్ రెడ్డి అని కొడాలి నాని అన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: