సాధారణంగా చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా పాటలు పాడుతుంటే.. రామ చిలుకలు మనం చెప్పే మాటల, పాటలు అనుకరిస్తూ పాడుతుంటే.. ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకే చిన్న పిల్లలు ముద్దు ముద్దు మాటల్ని చిలుక పలుకులు అంటారు.  అయితే సోషల్ మీడియా పుణ్యమా అని అప్పుడప్పుడు చిలుకలు మాట్లాడటం చూస్తున్నాం. కొన్ని జంతువులు కూడా మన మాటలను, పాటలను అనుకరిస్తున్నాయని వింటున్నాయి. తాజాగా ఓ కుక్క తన యజమాని హార్మోనియం వాయిస్తూ పాడుతున్న పాటకు శృతి కలిపి తనదైన రీతిలో పాట ఎత్తుకుంది. అదేంటీ కుక్కలు పాడుతాయా? అన్న అనుమానం మీకు రావొచ్చు.. దాని బాషలో అది పాడింది.. అంతే.

 

 ఇటీవల తన గానంతో సెలబ్రెటీలను తనవైపు తిప్పుకున్న  రాణు మోండల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఎక్కడో యాచకురాలిగా జీవనం కొనసాగిస్తున్న ఆమె గొంతులో అందమైన స్వరాలు ఉన్నాయని సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, నటడు హిమేష్ రష్మి ఆమెను చేరదీసి ఆమెతో  ‘తేరీ మేరీ తేరీ మేరీ కహానీ’ పాట పాడించారు.  ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో వివిధ పాటలు పడుతూ బాగా పాపులారిటీ సంపాదించుకుంటుంది.  ఒక సామాన్య స్థితి నుంచి తన గానంతో అందరి మెప్పు పొందింది మోండల్.  

 

తాజాగా ఆమె పాటిన  ‘తేరీ మేరీ తేరీ మేరీ కహానీ’ పాట తన యజమాని హార్మోనియం వాయిస్తూ పాడుతుండగా పక్కనే కుక్క రక రకాల విన్యాసాలు చేస్తూ శృతి కలిపి పాడింది.  రాగాలు తియ్యటానికి ప్రయత్నించింది. చలాకీగా తన స్టైల్లో రాగాలు తీసింది. ఆ కుక్క పాడుతుంటే పక్కన ఉన్నవారు.. మరింత ఎంకరేజ్ చేస్తున్నట్లు వినిపిస్తుంది.  ఏది ఏమైనా పాటకు ఏ ప్రాణి అయినా పరవశించి పోతాయని అనడం వింటుంటాం.. కానీ ఓ పాటకు కుక్క పరవశించి పాడటం మొదటి సారి వింటున్నాం అంటున్నారు నెటిజన్లు.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.  


 

మరింత సమాచారం తెలుసుకోండి: