బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జెపి నడ్డా నేడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆయనను న్యూ ఢిల్లీలోని బిజెపి ఆఫీస్ లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ కలిసి  పూల బొకే తో ఆయనను సత్కరించారు. వాస్తవానికి కొన్నేళ్లుగా బిజెపికి అధ్యక్షుడిగా పని చేస్తున్న అమిత్ షా, పార్టీ యొక్క సంస్థాగత పనులు తో పాటు పలు రాష్ట్రాల్లో పార్టీ పని తీరుపై ఎప్పటికప్పుడు రిపోర్టులు అందుకోవడం, అలానే ఇటీవల మే లో జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్క అభ్యర్థికి పార్టీ తరపున మంచి మద్దతు లభించేలా ప్రోత్సహించడం, అలానే ఎప్పటికప్పుడు పార్టీలో జరుగుతున్న పరిస్థితుల పై అవగాహన కలిగి పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడం వంటివి చేసారు. 

 

ఇక ఇటీవల ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నినాదంతో ముందుకు వచ్చిన బిజెపి వారు, ప్రస్తుతం హోమ్ మంత్రిగా పని చేస్తున్న అమిత్ షా స్థానంలో మరొక వ్యక్తిని ఎన్నుకోవడానికి నిశ్చయించారు. కాగా నేడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నడ్డా ఇకపై పార్టీని మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకాన్ని అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ వ్యక్తపరిచారు. విద్యార్థి దశ నుండే నడ్డా పార్టీ కోసం ఎంతో పాటు పడ్డారని,  కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన తీరు, అలానే ఆరెస్సెస్‌తో అనుబంధం, అన్నిటికంటే ముఖ్యంగా వివాద రహితుడిగా మంచి పేరు ఉన్నందున జేపీనడ్డాకు అవి ఎంతో అనుకూలంగా మారాయని తెలుస్తోంది. 

 

ఇక నడ్డా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జ్‌ రాధామోహన్‌సింగ్‌ కాసేపటి క్రితం ఆయనకు నియామకపత్రాన్ని అందించారు. ఇక ఈరోజు సాయంత్రం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రలతో నూతన అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న నడ్డా, గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఎంతో సమర్ధవంతంగా వ్యవహరించి పార్టీ తరపున మంచి పేరు దక్కించుకున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: