టైటిల్ చూడగానే.. ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా? అవును మరి.. కొన్ని టైటిల్స్ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మనం ఎంత అనుకుంటే ఏమి ప్రయోజనం.. ఆ ఘటనలు అలానే ఉంటాయి మళ్ళి.. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జర్మనీలో హోల్టే-స్టుకెన్‌బ్రాక్‌ అనే ఏరియాలో ఓ ఆఫీసులో 26 ఏళ్ళ యువకుడు పని చేస్తున్నాడు. 

 

అయితే ఆ యువకుడు ఉన్నట్టుండి 2016లో కోమాలోకి జారుకున్నాడు. అతడికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఫుడ్‌పాయిజనింగ్ వల్ల అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడని, తిరిగి సాధారణ స్థితికి రావడం చాలా కష్టమని తెలిపారు. అప్పటి నుంచి అతడు హాస్పిటల్‌లోనే చలనం లేకుండా జీవిస్తున్నాడు.

 

అయితే ఈ ఘటనను నమోదు చేసుకున్న పోలీసులు.. అతడికి పుడ్ పాయిజన్ ఎలా అయ్యింది అని.. వాటికీ సంబంధించి కారణాలు తెలుసుకోవాలని చాల ప్రయత్నాలు చేశారు. అప్పుడే అతడి కడుపులోని ఆహార నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.. ఆలా పంపిన పోలీసులకు పెద్ద షాక్ ఏ తగిలింది.. 

 

అనుకున్నట్టుగానే.. అనుమానించినట్టుగానే అతడిని కావాలని విగిత జీవిని చేశారు. అతడి కడుపులోకి ప్రమాదకరమైన రసాయనాలు శాండ్విచ్ ద్వారా పంపారు.. అందుకే అతను కోమాలోకి వెళ్ళిపోయాడు.. దీంతో పోలీసులు కేసులో మిస్టరీ బయటకు రావాలని మరింత కష్టపడ్డారు.. కానీ నిందితుడు దొరకలేదు.. 

 

దీంతో.. ఎవరో అతడికి విషపూరిత రసాయనాలను తినిపించి ఉంటారని అనుమానించి ఆ ఆఫీసులో ఒక్కొక్క ఉద్యోగిని విచారించడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే అతడితో ఎక్కువగా కలిసివుండే సహోద్యోగులను విచారించాడు.. అప్పుడే తెలిసింది ఆ రోజు అతను చివరిగా శాండ్‌విచ్‌ మాత్రమే తిన్నాడని తెలుసుకున్నారు.

 

అయితే అప్పుడే తెలిసింది..  క్లావుస్‌ ఓ అనే 57 ఏళ్ల వ్యక్తే అతడికి శాండివిచ్ తినిపించినట్లు విచారణలో తెలిసింది. అయితే అతను అది కావాలని తినిపించలేదని.. చంపాలని తినిపించలేదని చెప్పిన ఆ వృద్ధుడిని... అదులో రసాయనాలు ఉండటం వల్ల అతడే నిందితుడిగా భావించి మే, 2018లో పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు అప్పగించారు.

 

దీంతో కోర్టు గతేడాది మార్చి నెలలో హత్యాయత్నం కేసు కింద క్లావుస్‌కు జీవిత ఖైదు విధించింది. క్లావుస్ కేవలం బాధితుడికే కాదు, ఇతర ఉద్యోగులకు కూడా శాండ్‌విచ్‌లు తినిపించి చంపాలని చూశాడు ఆ నిందితుడు. అయితే ఆలా ఎందుకు చేశాడు.. అనేది మాత్రం ఇంతవరుకు బయటకు రాలేదు.. కాగా ఆ బాధితుడు మృతి చెందాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: