పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన మనమే చెట్లను కొట్టేస్తున్నాం. చెట్లు అంటే విలువ లేకుండా ఉంది.. ఇలాంటి వాళ్ళకు చెట్ల గురించి ఎప్పుడు తెలుస్తుంది అంటే.. పీల్చడానికి గాలి.. తినడానికి తిండి లేని సమయంలో తెలుసుతుంది. చెట్ల గురించి.. చెట్ల విలువ గురించి. అపుడు తెలిసిన పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు అనుకోండి..            

 

అయితే ఇంకా ఇది అంతే పక్కన పెడితే.. ఓ వ్యక్తి చెట్టును నరికాడు అని 50 వేలు జరిమానా విధించారు. దీంతో ఈ జరిమానా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కొత్తపేట సమీపంలోని చైతన్యపురి కాలనీలో తన ఇంటి సమీపంలో ఓ వ్యక్తి చెట్టును నరికేశాడు. దీంతో వ్యక్తికి అటవీశాఖ అధికారి ఆదివారం రూ .50 వేలు జరిమానా విధించారు.                      

 

చైతన్యపురి కాలనీలో నివసిస్తున్న మహ్మద్ అలీ అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో ఉన్న ఒక చెట్టును నరికివేశాడు. ఈ సంఘటనను ట్విట్టర్‌ ద్వారా స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆ ఘటనపై స్పందించిన హయత్‌నగర్‌ అటవీశాఖ అధికారి ఏకంగా ఓకేసారి 50 వేల రూపాయిలు జరిమానా విధించారు.         

 

ఇలా జరిమానాలు విధించడం కొత్త ఏమి కాదు.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. గత సంవత్సరం ఎస్‌ఆర్‌ నగర్‌లో మహిళా హాస్టల్‌ను నిర్వహిస్తున్న నాగమణి అనే మహిళా.. భవనం ముందు ఉన్న చెట్టును నరికివేసింది. దీంతో జిల్లా అటవీ అధికారి పి వెంకటేశ్వర్లు రూ .17,000 జరిమానా విధించారు. అప్పుడప్పుడు ఇలాంటి జరిమానాలు వేస్తేనే కదా.. మిగితావారు అయినా సక్రమంగా ఉండేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: