ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు ముక్కలైంది.  కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయబోతున్నారు.  ఒక్కటిగా ఉన్న రాజధాని ప్రాంతం ఇప్పుడు మూడుగా విడిపోతున్నది.  ఇది బాధాకరమైన అంశమే అయినప్పటికీ అభివృద్ధి కోసం తప్పడం లేదు.  అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.  


ఇంతవరకు బాగానే ఉన్నది.  అయితే, ఈరోజు అసెంబ్లీలో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి.  అమరావతిలో భూముల కొనుగోలు జరిగాయని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైకాపా ఆరోపణలుచేసింది.  ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు దాదాపుగా 40 ఎకరాల భూమిని బినామీ పేర్లతో అమరావతి ప్రాంతంలో కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు.  ఈ భూమి విలువ ఎకరం రూ. 10 కోట్ల వరకు ఉంటుంది.  


టోటల్ గా 40 ఎకరాల భూమి వీలుగా రూ. 400 కోట్ల వరకు ఉంటుంది.  ఈ స్థాయిలో భూముకు అక్రమంగా కొనుగోలు చేసినట్టుగా వైకాపా వాదిస్తోంది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనడానికి తమ దగ్గర నివేదికలు ఉన్నాయని, దీనిపై విచారణ చేస్తామని అంటున్నారు.  విచారణ చేయించాలని ఆర్ధికశాఖ మంత్రి స్పీకర్ ను కోరగా, దానికి స్పీకర్ అనుమతి ఇవ్వడంతో, జగన్ కూడా అందుకే ఒకే చెప్పారు.  


దీంతో త్వరలోనే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు సంబంధించిన విచారణ జరిగే అవకాశం ఉన్నది.  అయితే, దీనిపై ఎలాంటి విచారణ చేయిస్తారు అన్నది చూడాలి.  లోకాయుక్త ద్వారాజరిగే అవకాశం ఉన్నది.  అయితే, సిబిఐ, లేదా సిబిసిఐడి ద్వారా కానీ విచారణ జరగొచ్చని అంటున్నారు. ఈ విచారణ జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనే విషయం తెలియాల్సి ఉన్నది.  మొత్తానికైతే, ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో చాలా పెద్ద గుట్టు బయటకు వచ్చేలా ఉన్నది.  మరి ఈ వ్యవహారం ఎప్పటికి తెలుస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: