2019 సంవత్సరంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మొదలైన కష్టకాలం 2020 సంవత్సరంలో కూడా కొనసాగుతున్నట్లుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి ఏది కలిసి రావడం లేదు. ఓ వైపు నేతలు టీడీపీని వీడటం, మరోవైపు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వంపై ఏ పోరాటం చేసిన ఫెయిల్ అవుతూనే వచ్చారు. ఆయన చేసిన ఏ పోరాటాన్ని కూడా ప్రజలు నమ్మలేదు. ఫలితంగా జగన్ ప్రభుత్వంపై ఎలాగోలా వ్యతిరేకితని తీసుకోద్దామనుకున్న బాబు ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

 

సరే 2019లో ఈ విధంగా జరిగింది...2020లో ఏమన్నా కలిసొస్తుంది అనుకుంటే. ఇప్పుడు కూడా బాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి. జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానులు దెబ్బకు బాబుకు దిమ్మ తిరగడం మొదలైంది. ప్రజలందరూ మూడు రాజధానులని స్వాగతిస్తున్న బాబు మాత్రం అమరావతినే రాజధానిగా ఉంచాలని పోరాటాలు మొదలుపెట్టారు. ఇక ఈ పోరాటాలు కూడా ఫెయిల్ కావడమే గాక, రాష్ట్రంలో టీడీపీ ఇంకా వీక్ అవ్వడం మొదలైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో టీడీపీ బాగా దెబ్బతినేలా కనిపిస్తుంది.

 

జగన్ ప్రభుత్వం విశాఖలో ఎగ్జిక్యూటివ్, కర్నూలులో జ్యూడిషయల్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం ఖాయం కావడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బాబుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పరిస్థితిని గమనిస్తే ఈ రెండు ప్రాంతాల్లో టీడీపీకి గట్టి దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అందులోనూ అంతంత మాత్రమే ఉన్న రాయలసీమలో టీడీపీ భవిష్యత్తులో కోలుకునే అవకాశం కనబడటం లేదు. మామూలుగానే సీమలో టీడీపీకి అంత సీన్ లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సీమలో మెజారిటీ సీట్లు వైసీపీనే గెలుచుకుంది.

 

ఇక 2019 ఎన్నికలకొచ్చేసరికి టీడీపీ దారుణంగా ఓడిపోయింది. కర్నూలు, కడపలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అటు అనంతపురంలో 2, చిత్తూరులో ఒక సీటు గెలుచుకుంది. అంటే మొత్తం 52 సీట్లలో 3 మాత్రమే గెలుచుకుంది. ఇక ఇప్పుడు మూడు రాజధానులని వ్యతిరేకించడం వల్ల భవిష్యత్తులో టీడీపీ రాయలసీమలో దుకాణం ఎత్తేయడం ఖాయం. తెలంగాణలో ఏ విధంగా పార్టీ తుడిచిపెట్టుకుపోయిందో..అదేవిధంగా సీమలో కూడా అడ్రెస్ లేకుండా పోనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: