ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులు కాన్సెప్ట్ దాదాపు వర్కౌట్ అయిపోయింది. అతి త్వరలోనే రాష్ట్రానికి మూడు రాజధానులు రానున్నాయి. ఇక ఈ మూడు రాజధానులని అన్ని ప్రాంత ప్రజలు ఆనందంగా స్వాగతిస్తున్నారు. అయితే అమరావతి ప్రాంతంలో రైతులు దీనిపై కొంత అభ్యంతరం చెబుతున్నా...వారికి తగిన న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో, ఆ సమస్య కూడా త్వరలో తీరిపోవడం ఖాయం.

 

కాకపోతే టీడీపీ మాత్రం మూడు రాజధానులని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అమరావతిలో తమ ఆస్తులు విలువ ఎక్కడ పోతుందనే ఉద్దేశంతో, అమరావతినే రాజధానిగా ఉంచాలని తెగ హడావిడి చేసేస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మూడు రాజధానులపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాయలసీమలో కొందరు టీడీపీ నేతలు కర్నూలులో హైకోర్టు పెట్టడాన్ని స్వాగతిస్తున్నారు. ఇటు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నారు.

 

అంటే అమరావతికు టీడీపీలోనే ఫుల్ సపోర్ట్ లేదని అర్ధమవుతుంది. అందుకే టీడీపీ అధినేత రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తున్న కొందరు టీడీపీ నేతల మద్ధతు దక్కడం లేదు. అధినేత నిర్ణయం తీసుకున్న కూడా టీడీపీ నేతలు ఆయన బాటలో వెళ్ళడం లేదు. దీని బట్టి చూస్తే ఆయా ప్రాంతాల్లో ప్రజల ఆకాంక్ష మేరకే టీడీపీ నేతలు తమ నిర్ణయాన్ని చెబుతున్నారు. ఇదే సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల వైసీపీ ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా అమరావతికు అటు ఇటు ఉన్న కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు నిస్సందేహంగా మూడు రాజధానులకు మద్ధతు తెలుపుతున్నారు.

 

ఇక వీరు ఈ విధంగా బహిరంగంగా తమ నిర్ణయాన్ని చెప్పిన, వారి వారి నియోజకవర్గాల్లో వ్యతిరేకిత రాలేదు. అంటే ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా అధికార వికేంద్రీకరణ కోరుకుంటూనే, అన్ని ప్రాంతాలు చెందాలని కోరుకుంటున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు తమ అధినేత నిర్ణయానికి కట్టుబడి డేర్‌గా తమ నిర్ణయం చెప్పినట్లు, విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు తమ అధినేత చెప్పిన నిర్ణయానికి కట్టుబడి లేరు. దీని బట్టి చూసుకుంటే ప్రజల్లో కూడా మూడు రాజధానులపై ఎంత సానుకూలంగా ఉన్నారో అర్ధమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా బాబు డ్రామాలు ఆపి మూడు రాజధానులకు మద్ధతు తెలిపితే బాగుంటుందేమో. లేదంటే ప్రజలే ఆయన్ని చూసుకుంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: