ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం ఆన్లైన్ శాశిస్తుంది. ఏం కావాలన్నా ఆన్లైనే  ఆప్షన్ గా మారిపోయింది. ఇతరులతో మాట్లాడలన్న  ఆన్లైన్.. ఏదైనా కొనాలన్నా ఆన్లైన్..ఏం  చేయాలన్నా ఆన్లైన్... ప్రతి విషయంలో జనాలు రోజురోజుకు ఆన్లైన్ మీద డిపెండ్ అయి పోతున్నారు. ఇతరులతో డైరెక్ట్ గా మాట్లాడుకోవడం కంటే ఎక్కడో  ఉన్న ఫ్రెండ్ తో ఫోన్లో చాటింగ్ చేయటానికి  ఎక్కువ ఇష్టపడుతున్నారు నేటితరం నెటిజన్లు. ఆన్లైన్లో కూడా ఎన్నో మెసేజింగ్ యాప్స్  నెటిజన్లకు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న యాప్ ఏది అంటే  అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ఫేస్బుక్. రోజురోజుకు ఫేస్బుక్ వినియోగదారులు సంఖ్య పెరుగుతూనే ఉంది. 

 

 ఫేస్బుక్ సంస్థ కూడా వినియోగదారుల కోసం సరి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుండంతో ఫేస్బుక్ కి రోజురోజుకు వినియోగదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఆన్లైన్ మెసేజింగ్ యాప్ ల mలో ఫేస్బుక్ మొదటి ప్లేస్ లో  కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు ఫేస్బుక్ వాడుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఫేస్ బుక్ లో కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా పరిచయం అవ్వడానికి వీలు ఉండటం తో ఫేస్బుక్ వాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఫేస్బుక్ నీ ఇష్టం వచ్చినట్టు వాడితే మాత్రం సమస్యలు తప్పవు అన్నది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ఫేస్బుక్లో కూడా ఎంతో మంది సైబర్ నేరాల బారిన పడిన వాళ్ళు ఉన్నారు. 

 

 

 అయితే ఫేస్బుక్ వాడినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఫేస్బుక్లో వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కువగా పోస్ట్ చేయకూడదు. అంతే కాకుండా మద్యం తాగినప్పుడు ఫేస్బుక్ సహా సోషల్ మీడియా యాప్స్ ను  కూడా వాడకూడదు . ఎందుకంటే మద్యం తాగినప్పుడు కొంతమంది ఏం చేస్తారో వారికే తెలియదు. ఏదైనా సమాచారాన్ని యాప్స్ లో  పోస్ట్ చేస్తే మాత్రం ఆ తర్వాత ఇబ్బంది పడక తప్పదు. అంతేకాకుండా పరిచయం లేని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయండి. ఫేస్బుక్ లో  మీ ప్రొఫైల్ ని అందరూ చూసేలా పెట్టుకోకండి. ఇంటి వివరాలు కానీ ఆస్తుల వివరాలు కానీ పనివేళలు కు సంబంధించిన వివరాలను ఫేస్బుక్ లో పెట్టకండి. ఫేస్బుక్ లో ఎవరి పై అసభ్యంగా మాట్లాడకండి. ఇలాంటివి చేయడం ద్వారా ఫేస్బుక్ నుండి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: