నేడు ఆంధ్ర ప్రదేశ్ అత్యవసర అసెంబ్లీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశం  మొదలుకావడమే రసాబాసాతో  మొదలైంది. గతంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో అమరావతి లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి... జగన్ సర్కార్ కు నివేదిక అందిన విషయం తెలిసిందే. అయితే అమరావతి లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించి జగన్ సర్కార్ అసెంబ్లీలో పూర్తి వివరాలను వెల్లడించింది.ఈ క్రమంలోనే అధికార విపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో... అసెంబ్లీ సమావేశం మొత్తం రసాభాసగా  మారింది. అంతే కాకుండా మూడు రాజధానిలకు సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ . 

 

 

 అయితే ఈ అసెంబ్లీలో వైసీపీ మంత్రులు... అమరావతిలో బినామీల పేరిట చంద్రబాబు ఎన్ని అక్రమ భూ  కొనుగోళ్లు జరిపారు వాటికి సంబంధించిన వివరాలను పేర్లతో సహా వివరించారు. అయితే మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలు సరైనవి  కాదని... కక్ష సాధింపు చర్య గానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ టిడిపి నేతలు తప్పుబట్టారు. ఇలా అన్ని  అంశాల్లో  టీడీపీ వైసీపీ మధ్య అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం జరిగిందనే చెప్పాలి. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు మాట్లాడడం మొదలు పెట్టి 50 నిమిషాలు అయ్యిందని... ఇంకా ఆ పెద్దమనిషికి  ఎంత సమయం కావాలి అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. 

 

ఆ పెద్దమనిషి ఇంకా ఎంతసేపు మాట్లాడుతారో అడిగి... అసెంబ్లీ సమయంలో ఆయనకు కేటాయించే సమయం ఏమైనా ఉంటే కేటాయించండి లేదంటే ఆపేసేయ్యండి  అంటూ... సభాపతి స్పీకర్ తమ్మినేని కు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్. ఇరవైఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న సభ్యుల్లో  ఐదు మంది మాట్లాడారని కానీ 151 మంది ఉన్న తమ సభ్యుల్లో  ఏడుగురు మాత్రమే మాట్లాడారు అంటూ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారు అంటూ విమర్శించారు  ముఖ్యమంత్రి జగన్మోహన్. రాష్ట్రంలోని ఏ ప్రాంతం పైన చంద్రబాబుకు ప్రేమ లేదని టిడిపి నేతలకు రైతులపై అసలే ప్రేమ లేదంటూ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: