ఎందుకు ఏమిటి ఎలా అనే సూత్రం గురించి తెలుసా ? తెలియకపోతే అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావు- బాబు మోహన్ కామెడీ చూడాల్సిందే. అందులో ఏదో ఓ కొత్త విషయాన్ని కనిపెట్టడానికి తాడు పట్టుకుని బాబు మోహన్ ప్రయత్నిస్తుండగా వెంక కోటా వచ్చి ఏంట్రా అది అంటే ? మరి అదే ఎందుకు ఏమిటి ఎలా అనే విషయాన్ని కనిపెడుతున్నా అంటాడు బాబు మోహన్. సర్లే ఏదో కనిపెడుతున్నాడు కదా వెనుకే వెళ్తాడు కోటా. లోపలికి వెళ్ళాక ఒక్కసారిగా అది పేలిపోతుంది. అప్పుడు ఇదేనా నాన్నా నువ్వు కనిపెట్టిన కొత్త విషయం అంటే... మరదే ఇక్కడికి రాబట్టే కదా ఇక్కడ ఒక బాంబు ఉందని, అది పేలుతుందని తెలిసింది అంటాడు బాబు మోహన్. 


సరిగ్గా అదే సీన్ ఇప్పుడు అమరావతి లోనూ కనిపిస్తోంది. పెద్దాయన  చెప్పాడు కదా అని ఎందుకు ? ఏమిటి ?ఎలా ? అని వెనుక ముందు ఆలోచించకుండా ఇక్కడ పెట్టుబడులు పెట్టి బినామీ పేర్లతో భూములు కొన్న వారంతా ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. తెలంగాణకు చెందిన వారు, తెల్ల రేషన్ కార్డు దారులు, ఇలా ఎవరు దొరికితే వారి పేరు మీద భూములు కొన్న బకాసురులు అడ్డంగా బుక్కయిపోయారు. ఒక్క అమరావతిలో ఇన్ని కుట్రలు, మోసాలు జరిగితే కొత్తగా వచ్చిన కుర్ర  సీఎం ఊరుకుంటాడడా ? అబ్బాయ్ ఎవరెవరు ఎంతెంత కొన్నారో లెక్కలు బయటకి తీయండి అంటూ ఆ ఏసీబీని, రెవెన్యూ ని, ఇలా అందరిని రంగంలోకి దించేసాడు. ఇక చూస్కోండి బినామీ బకాసురుల్లో ఒకటే టెన్షన్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఒకటే గుండెదడలు మొదలయిపోయాయి. 


ఇక ఈ రోజు అసెంబ్లీలో ఆ పెద్దాయన ముఖం చూస్తే తప్పు చేసినవాడిలా వాడిపోయిన ముఖంతో దిగాలుగా కూర్చుంటే ఎంత ఖర్మ వచ్చి పడింద్రా బాబు అని ఎవరికైనా అనిపించక మానదు. ఇక అసెంబ్లీ లో ఒక్కక్కరూ అమరావతి పేరు చెప్పి ఎంతెంత మోసానికి పాల్పడ్డారో, ఎన్ని స్కామ్ లు చేశారో చెబుతుంటే ఆ పెద్దాయన తో సహా ఆ పార్టీ నాయకుల ముఖాలు పంచర్ పడ్డ సైకిల్ లా తయారయ్యాయి. పోనీ మేము తప్పు చేయలేదు మొర్రో అని గట్టిగా చెబుదామా అంటే అలా చెప్పుకోవడానికి కుదరదే ...? ఎందుకంటే ఆధారాలతో సహా దొరికేసారే ..! అందుకే కదండీ మా నిప్పులాంటి మనిషి ఇలా తప్పు చేసినవాడిలా బాధగా, దిగాలుగా దిక్కులు చూస్తూ ఉండిపోతే బాధగా ఉండదా అండి .....? ఇప్పుడు మా నాయకుడిని, మా పార్టీని కాపాడడానికి బ్రిఫ్డ్ మీ అనే వారే లేరా అయ్యో అయ్యయ్యో అంటూ తమ్ముళ్లు గగ్గోలు పెట్టేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: