రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.  కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఇప్పటికే ఫైనల్ చేశారు.  రేపోమాపో అమరావతి నుంచి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి దీనికి సంబంధించిన బిల్లును ఈరోజు సభలో ప్రవేశపెట్టారు.  ఉదయం నుంచి అసెంబ్లీ జరుగుతూనే ఉన్నది.  వాద ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి. వైకాపా ప్రభుత్వానికి ధీటుగా తెలుగుదేశం పార్టీ కూడా సమాధానాలు చెప్తూ సభను ఆసక్తిగా మార్చేలా చేసింది.  చంద్రబాబు ఈ సందర్భంగా చాలాసేపు మాట్లాడారు.

గత ప్రభుత్వం అమరావతిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో ఎలాంటి నివేదికలు ఉన్నాయో వివరించారు.  అందరికి అందుబాటులో ఉండే విధంగానే అమరావతిని ఏర్పాటు చేశామని, ప్రజలందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన తరువాత మాత్రమే రాజధానిని ఏర్పాటు చేసినట్టు చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీని ఏర్పాటు చేసిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అడ్డుకున్నారని అన్నారు.  


కానీ, రాజశేఖర్ రెడ్డి తన తరువాత ముఖ్యమంత్రి అయ్యాక, కంటిన్యూ చేశారని, ఆ ప్రాజెక్టులను పూర్తి చేశారని, దాని వలన ఇప్పుడు హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికి తెలిసిందే అని బాబు పేర్కొన్నారు.  అదే విధంగా ఎయిర్ పోర్ట్ నిర్మాణం సమయంలో కూడా ఇలాంటి వాదనలే వినిపించాలని, కానీ ఈరోజు శంషాబాద్ ఎయిర్  పోర్ట్ ఎంతగా అభివృద్ధి సాధించిందో అందరికి తెలిసిన విషయమే అని చెప్పారు.  


వైఎస్ రాజశేఖర్ రెడ్డి నడిచిన మార్గంలో నడవాలని, రాజకీయ కోణంలో కాకుండా, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడవాలని, వయసులో చిన్నవాడివైనా చేతులెత్తి దణ్ణం పెడుతున్నానని... తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, అలోచించి నిర్ణయం తీసుకోవాలని జగన్ ను కోరారు.  అనంతరం సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో 17 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సభనుంచి స్పీకర్ బయటకు పంపించేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: