నేడు తన 26 చిత్రం యొక్క మొదటి రోజు షూటింగ్ పూర్తి చేసుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సరాసరి హైదరాబాద్ నుండి మంగళగిరి ప్రాంతానికి తరలి వెళ్ళగా అక్కడ పోలీసులు అతనిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అవతల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అతను వెళ్లి అమరావతిలోని రైతులతో మాట్లాడతాను అని పోలీసు వారిని కోరిన నేపథ్యంలో వారంతా అతనికి అడ్డుపడడం ఇప్పుడు రాష్ట్ర రాజధాని ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. తను ఎటువంటి ప్రసంగాలు చేయనని.... కేవలం వెళ్లి వారిని పరామర్శించి పరిస్థితులను శాంత పరుస్తానని అని చెప్పినా కూడా పోలీసులు అతని మాట వినిపించుకోకపోవడం గమనార్హం.

 

దానికి ముందు అతను మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ మరియు ప్రసంగం చేసేందుకు కూడా పోలీసులు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. పోలీసుల తీరుపై జనసేన పార్టీ నాయకులు విపరీతమైన ఆగ్రహం లో ఉండగా ఇదంతా కేవలం అధికారం వారు తమకు నచ్చినట్లు రాష్ట్రంలో పరిస్థితులు ఉండాలని తమపై చేస్తున్న కుట్ర గా వెల్లడించారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పోలీసు వారిని ఎన్నోసార్లు అభ్యర్థించినా కూడా వారు అతని మాటను లెక్కచేయకపోవడం మరియు కనీసం రాష్ట్ర రాజధాని ప్రాంతంలో కి అనుమతించకపోవడం ఏమిటి అని వారు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.

 

ఇకపోతే జనసేన పార్టీ సభ్యుడు మరియు పవన్ కళ్యాణ్ యొక్క సొంత సోదరుడు అయిన నాగబాబు తాము ఎట్టిపరిస్థితుల్లో అమరావతి లోని గ్రామాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడుతామని…. తమను ఎవరు ఆపుతారో కూడా చూస్తామని సందర్భంగా పట్టుదలతో ప్రకటించాడు. ఒక ప్రజాస్వామ్య దేశంలో అధికార పార్టీ నుంచి వస్తున్న ఇటువంటి ప్రవర్తన చాలా అవాంఛనీయం అని చెప్పిన నాగబాబు తాము ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు చేరువగా ఉండి వారికి ఏది మంచో దానిపై పోరాటం చేస్తామని అన్నారు. మరి ఇది చివరికి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: