విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా వికేంద్రీకరణ జరగాలని మూడు చోట్ల రాజధాని ఉంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అత్యవసర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అసలు రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పెట్టడానికి గల కారణాలను దురుద్దేశాలు అన్ని విషయాలు బట్టబయలు చేసి కేవలం తన వర్గ ప్రజల కోసం మరియు తన కుటుంబ సభ్యులు అలాగే తన పార్టీకి చెందిన వాళ్లు మాత్రమే బాగు పడాలన్న ఉద్దేశంతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి తన వారి చేత అమరావతి ప్రాంతంలో భూములు కొనిపించి ఆ తర్వాత అమరావతి రాజధానిగా చంద్రబాబు ప్రకటించారని అన్ని లెక్కలు ఎవరు ఎక్కడ ఎంత ఎన్ని ఎకరాలు కొన్నారు అన్ని విషయాలు బయటపెట్టారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

 

ఈ సందర్భంలో చివరిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అసలు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటి ఎక్కడ ఎటువంటి వనరులు ఉన్నాయి ఏ విధంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలి వంటి విషయాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభలో ఆమోదం పొందే విధంగా సభ ను ముందుకు నడిపించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, అమరావతి లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌, కర్నూలు జ్యుడీషియల్‌ క్యాపిటల్లుగా శాసన సభ ఆమోదం తెలిపింది.

 

సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం చాలా బావుంది వేగంగా మాట్లాడుతూ ఇటువంటి చారిత్రాత్మక ఘట్టం లో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు సీఎం జగన్ కి కృతజ్ఞతలు...ఇక నుండి వెనకబడిపోయింది ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో నడవటం గ్యారెంటీ అని ఈ సందర్భంగా ఇటువంటి చారిత్రాత్మక బిల్లు  నా చేతుల పై పాస్ కావడం చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మళ్లీ అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అవుతుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: