ఇటీవల కొంతమంది టిఆర్ఎస్ పార్టీ మంత్రులు కేటీఆర్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవడం గ్యారెంటీ అని మీడియా ముందు బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్న మంత్రి కేటీఆర్ కచ్చితంగా జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా కేటీఆర్ దగ్గరుండి ఎన్నికల పర్యవేక్షణ చూసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో రెబల్స్ అభ్యర్థుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా వ్యవహరించకుండా వాళ్లను బుజ్జగించే విధంగా మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు స్టార్ట్ చేయడంతో...చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలవడానికి పార్టీ రెబల్స్ చేత పార్టీకి మేలు చేకూరే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు గెలిపించడానికి తండ్రికి లాభం చేకూరే విధంగా వాళ్లతో రెబల్స్ తో చాలాచోట్ల మంత్రి కేటీఆర్ సామరస్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.

 

ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో తనదైన శైలిలో రాజకీయం చేసి తన దారిలోకి రెబల్స్ ని తెచ్చుకున్నట్లు కఠినంగా వ్యవహరించే వారిపట్ల మాత్రం మౌనంగానే ఉంటు ఎవరి పై మాత్రం వేటు వేయకుండా ఎవరితో కఠినంగా వ్యవహరించకుండా మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు వెళుతున్నాడు మంత్రి కేటీఆర్.

 

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ...తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఆశించిన స్థాయిలో ఎంపీ స్థానాలు గెలవలేక పోవడంతో ఇదే సమయంలో బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బల పడటంతో పాటుగా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న స్థానాలలో బిజెపి పార్టీ గెలవడంతో తాజాగా జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని అత్యధిక మెజార్టీ స్థానాలు గెలవాలన్న కసితో చాలా ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ ఎన్నికలను తీసుకున్నారు మంత్రి కేటీఆర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: