ఓ తల్లి సూచింది.. అదే ఆ పిల్లాడికి మరణాన్ని తీసుకొచ్చింది.. ఆ తల్లి సూచనే ఆ పిల్లాడిని కాటికి పంపేలా చేసింది. అంత ఘోరమైన సూచనా ఏంటి అనుకుంటున్నారా? ఇంకేముంది.. అదే.. మనం టీనేజ్ లో ఉన్నప్పుడు జుట్టుని అడ్డదిడ్డంగా పెంచుతే మన తల్లితండ్రులు జుట్టు కత్తిరించుకోవాలని సూచిస్తారు కదా.. అలానే అడ్డంగా పెరిగిన జుట్టును కట్ చేసుకోవాలని ఆ టీనేజర్ కు సూచించింది ఓ తల్లి. 

 

సాధారణంగానే ఎవరైనా చిన్నపిల్లలకు జుట్టు ఎక్కువ అవుతే ఎం చేస్తారు.. చిన్న పిల్లలు అయితే తల్లితండ్రులే బార్బర్ వద్దకు తీసుకు వెళ్లి జుట్టు కత్తిరిస్తారు.. అదే కొంచం పెద్దవాడు అయితే వేళ్ళు రా... జుట్టు కత్తిరించుకోపో.. ఎలా ఉన్నవో చూడు.. అని తిట్టి మరి పంపిస్తాం. ఇంకా టీనేజర్ అయితే.. ప్రస్తుతం జుట్టు పెరగడమే ఫ్యాషన్ అని వదిలేస్తారు. 

 

అయితే.. ఇంకా విషయానికి వస్తే.. ఆ తల్లి కూడా ఎంతో ఓపికగా కొన్ని నెలల నుండి జుట్టు కత్తిరించుకో అని సూచిస్తుంది.. కానీ ఆ కొడుకు కట్ చేయించుకోలేదు.. దీంతో కోపం వచ్చి తిట్టింది.. మనస్తాపంతో టీనేజర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లికి కడుపుమంట పెట్టి పోయాడు.. 

 

ఈ విషాద దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నైలో శ్రీనివాసన్‌ అనే 16 ఏళ్ల ఉన్నాడు. గత కొద్దికాలంగా జుట్టును విపరీతంగా పెంచుతున్నాడు. గుబురుగా.. అడ్డంగా పెరిగిన జుట్టును కట్ చేసుకోవాలని శ్రీనివాసన్‌కు ఆ తల్లి చెబుతూనే ఉంది... కానీ ఆ టీనేజర్ తల్లిమాటలు పట్టించుకోలెదు.. దీంతో ఓ రోజు కోపం వచ్చి చెడామడా తిట్టేసింది.

 

చక్కగా క్రాఫ్ చేయించుకుని శుభ్రంగా ఉండమని సలహా ఇచ్చింది.. అంతే.. మనస్తాపంతో ఆ టీనేజర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన రూమ్ లో నే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు... ఏం పిల్లలు అండి విల్లు.. చివరికి జుట్టు కత్తిరించుకో అనే సలహా ఇచ్చిన ఆత్మహత్యలు చేసుకొని తల్లితండ్రులకు కడుపుకోత పెడుతున్నారు. అంతా వీక్ మైండ్ సెట్ తో పిల్లలు పెరుగుతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: