వైఎస్ జగన్ అనుకున్నట్టుగానే అంతా జరిగింది.  విశాఖకు  కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేయాలనీ అనుకున్నారు.  అనుకున్నట్టుగానే జగన్ ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే అనుకున్నది సాధించి అందరి మనసులు గెలుచుకున్నారు.  నిన్నటి ఉదయం నుంచి అమరావతిలో హైడ్రామా నెలకొన్నది.  ఉదయం కేబినెట్ మీటింగ్, ఆ వెంటనే అమరావతి అసెంబ్లీలో మూడు రాజధానుల చర్చ, సుదీర్ఘమైన చర్చ అనంతరం రాజధానిని ఏర్పాటు చేయడం జరిగిపోయాయి.  


అయితే నిన్నటి రోజున ఈ బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది.  ఈరోజు ఆ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టబోతున్నారు.  శాసనమండలిలో ఈ బిల్లు విషయంలో ఎలా ఆమోదం చేసుకుంటారు అన్నది అందరి ముందున్న ప్రశ్న.  ఎందుకంటే శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి 32 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.  వీరంతా ఈ బిల్లును వ్యతిరేకిస్తారా లేదంటే ఆమోదం తెలుపుతారా అన్నది చూడాలి.  


ఒకవేళ వ్యతిరేకిస్తే వైకాపా ఏం చేస్తుంది.  లేదా ఆమోదిస్తే తెలుగుదేశం పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూడాల్సిన అంశం.  అయితే, తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే తప్పకుండా ఈ బిల్లును మండలిలో అడ్డుకుంటామని అంటున్నారు.  అడ్డుకునేటట్టయితే ఈ బిల్లును మండలిలో ఎమ్మెల్సీలను సభనుంచి సస్పెండ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అడ్డుకునే క్రమంలో ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.  


బిల్లును అడ్డుకుంటూ అందరికి ఇబ్బందులు కలిగిస్తారా లేదంటే, అడ్డుకోకుండా బిల్లుకు ఆమోదం తెలిపేలా చేస్తారా అన్నది చూడాలి.  ఇక నిన్నటి రోజున అసెంబ్లీ ముగిసిన తరువాత శాసనసభ బయట చంద్రబాబు నాయుడు  కూర్చొని నిరసనలు తెలియజేస్తుండగా, ఆయన్ను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.  అటు మంగళగిరి పార్టీ ఆఫీస్ లోనే పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు.  మొత్తానికి హైడ్రామాలా మధ్య బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు మూడు ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: