దేశంలో అరాచక శక్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  దేశంలో విద్వాంసులను సృష్టించేందుకు అనేక పధకాలు పన్నుతున్నారు.  ముఖ్యంగా దేశాన్ని నాశనం చేసేందుకు ఉగ్రవాదులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇందులో భాగంగానే కొంతమంది మంగళూరు విమానాశ్రయంలో బాంబు పెట్టి భయానక వాతావరణాన్ని సృష్టించాలని చూశారు. అయితే, అధికారులు సకాలంలో గుర్తించడంతో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు.  మంగళూరు విమానాశ్రయంలో ఓ వ్యక్తి టికెట్ కౌంటర్ వద్ద ఓ లాప్ టాప్ బ్యాగ్ ను విడిచి వెళ్ళాడు.  


అలా బ్యాగ్ అక్కడే విడిచిపెట్టడంతో అధికారులకు అనుమానం వచ్చింది.  అందులో బాంబు ఉన్నట్టు గుర్తించిన అధికారులు వెంటనే బాంబు నిర్వీర్యం చేసే అధికారులకు సమాచారం అందించారు.  హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆ అధికారులు బ్యాగ్ ను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లి విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కెంజారు మైదానంలో ఇసుక బస్తాల మధ్య ఉంచి పేల్చివేశారు.  దీంతో విమానాశ్రయానికి పెను ప్రమాదం తప్పింది.  


ఎవరు ఈ బ్యాగ్ వదిలివెళ్లారు అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.  బ్లూ కలర్ క్యాప్ పెట్టుకొని చేతిలో బుక్ పట్టుకొని వచ్చిన వ్యక్తి ఆ బ్యాగ్ ను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. అతను వచ్చే సమయంలో ఆటోలో వచ్చినట్టుగా పోలీసులు సిసి టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు.  అలా వచ్చిన వ్యక్తి ఎవరు ఏంటి, ఉగ్రవాదులు మైసూరులో ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఎక్కడ ఉంటారు.  ఎలా ఉన్నారు... మంగళూరులో ఉంటె వారి ప్లాన్ ఏంటి అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.  


ఇటీవలే సిఏఏ కు వ్యతిరేకంగా మంగళూరులో అనేక అరాచక శక్తులు పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంతంగా ఉండే దక్షిణ కర్ణాటక ఇప్పుడ కొంతకాలంగా భయం గుప్పిట్లో ఉండిపోయింది.  ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు.  అన్నింటికీ మించి అరాచక శక్తులు అధికంగా ఉండటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  మరి చూడాలి ఏమౌతుందో.  ఎలా దీనిని పోలీసులు సాల్వ్ చేస్తారో.  

మరింత సమాచారం తెలుసుకోండి: