ఒకప్పుడు గుంటూరు అందరిలో ఒక తెలియని భయం ఉండేది.  రాయలసీమలో ఫ్యాక్షన్ వాతావరణం ఎలా ఉండేదో ఇప్పుడు గుంటూరులో కూడా రౌడీయిజం దాదాగిరి ఎక్కువగా ఉండేవి.  తరువాత క్రమంగా గుంటూరు నగరం అభివృద్ధి చెందుతుండటంతో నగరం నుంచి ఈ దాదాగిరి, గూండాయిజం అన్నది దూరం అయ్యాయి.  కొంతవరకు ఉన్నప్పటికీ ఎక్కడో మూలగా ఉంటున్నాయి.  పెద్దగా బయటకు రావడం లేదు. కానీ, ఇప్పుడు అవి మరలా పురుడుపోసుకోబోతున్నాయా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలానే కనిపిస్తోంది.  పదిపదిహేను ఏళ్ల క్రితం వరకు ఉన్న సిట్యుయేషన్స్ మరలా ఇప్పుడు పునరావృతం కాబోతున్నాయి.  


ఒకప్పుడు గుంటూరు జిల్లాకు పంపే అధికారులు చాలా స్ట్రిక్ట్ అండ్ డేరింగ్ అధికారులను పంపించేవారు.  అక్కడ పరిస్థితులు అదుపులో ఉండేవి.  2014 లో రాజధాని ప్రాంతం అమరావతి అని తెలిసిన తరువాత ఈ అరాచక శక్తులు తగ్గిపోయాయి.  కారణం ఏంటి అంటే రాజధాని ప్రాంతంలో ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది.   ఎందుకులే అని చెప్పి చాలా వరకు తగ్గిపోయాయి.  అయితే, అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలిస్తున్న నేపథ్యంలో, ఈ ప్రాంతానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు.  


భద్రత విషయంలో కూడా విశాఖకు ఇచ్చిన ప్రాధాన్యత అమరావతి ప్రాంతానికి ఉండే అవకాశం లేదు.  ఇది అరాచక శక్తులు తిరిగి పుంజుకోవడానికి అనుకూలంగా మారుతుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.  గుంటూరులో దందా పెరిగితే... దాని ప్రాభవం చాలా దూరం వెళ్తుంది.  అటు విజయవాడలోను ఇదే గూండాయిజం ఉన్నది.  అక్కడ కూడా అరాచక శక్తులు విద్వాంసులు సృష్టించే అవకాశం ఉంటుంది.  


వీటిని దృష్టిలో పెట్టుకొని అమరావతిలో గతంలో ఉన్నట్టుగానే భద్రతను ఉంచితే పర్వాలేదు.అలా కాకుండా భద్రత తగ్గితే మాత్రం గూండాయిజం, రౌడీయిజం పెరిగిపోతుంది.  ఎందుకంటే గత ఐదేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో డబ్బు దండిగా వచ్చి చేరింది.  దానిని కొల్లగొట్టేందుకు ఇలాంటి శక్తులు తప్పకుండా ప్రయత్నిస్తాయి.  శాంతి భద్రతలు అదుపులో ఉన్నంతకాలం ఇలాంటి శక్తులు బయటకు వచ్చే అవకాశం ఉండదు.  ఇప్పటిలానే ప్రశాంతంగా ఉండేలా చూస్తారా లేదంటే అరాచక శక్తులను పెంచి పోషిస్తారా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: