వాహనం డ్రైవింగ్ చేయాలి అంటే డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరం.  భారతీయలు చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటారు.  పట్టుకోనంత వరకు అందరూ దొరలే దొరికినప్పుడే కదా అసలు విషయం బయటపడేది.  అయితే, మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటె విదేశాల్లో కూడా డ్రైవింగ్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ.  మాములుగా విదేశాల్లో డ్రైవింగ్ చేయాలి అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ మీదగ్గర ఉండాలి.  


అలా మీదగ్గర అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మీరు డ్రైవింగ్ చేయగలుగుతారు.  అలా కాకుండా కొన్ని దేశాల్లో మాత్రం ఇండియా లైసెన్స్ ఉంటె చాలు అక్కడ కూడా హ్యాపీగా డ్రైవింగ్ చేస్తూ ఆనందించ వచ్చు.  జర్మనీ వెళ్లిన వాళ్లకు దీని గురించి బాగా తెలుస్తుంది.  ఎలా అంటే అక్కడ ఇండియా లైసెన్స్ ఉంటె చాలు ద్విచక్ర, లేదా కారు ఏదైనా సరే మీరు సొంతంగా నడుపుకుంటూ వెళ్లొచ్చు.  దానికి అక్కడి అధికారులు అనుమతి ఇస్తారు.  జర్మనీతో పాటుగా బ్రిటన్, స్కాట్లాండ్, వేల్స్ రోడ్లపై కూడా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లొచ్చు.  


అలానే ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ అనుమతి ఉన్నది.  అయితే, అనుమతి ఉన్న వాహనం మాత్రమే నడిపే అవకాశం ఉంటుంది.  ఏ వాహనం పడితే ఆ వాహనం నడిపే అవకాశం ఉండదు.  అలానే న్యూజీలాండ్ లో 12 నెలల పాటు ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ తో హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లొచ్చు.  స్విస్ లో కూడా ఈ అవకాశం ఉన్నది.  12 నెలల పాటు స్విస్ లో ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ తో హ్యాపీగా చక్కర్లు కొట్టొచ్చు.  


ఇక దక్షిణాఫ్రికా సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.  మీదగ్గర ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటె హ్యాపీగా అక్కడ మీరు ఎంజాయ్ చెయ్యొచ్చు.  చక్కగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. స్వీడన్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా, అమెరికా వంటి దేశాల్లో కూడా ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది.  ఇండియా లైసెన్స్ ఉంటె చాలు హ్యాపీగా మీరు ఆయా దేశాల్లో కొన్ని అనుమతులతో డ్రైవింగ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: