చంద్రబాబుకు రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుబంధం ఉన్నది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు.  ఆ అనుభవం ఆయనకు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.  కానీ, ఇటీవల కాలంలో అనుభవం ఉన్నప్పటికీ దానిని పెద్దగా ఉపయోగించుకోలేకపోతున్నారు.  అనుభవ లేమిని ప్రదర్శిస్తున్నారు.  అనుభవం పెద్దగా లేకున్నా కొంతమంది దూసుకుపోతుంటే ఇంతటి సుదీర్ఘమైన అనుభవం కలిగిన వ్యక్తులు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు.  


ఇక ఇదిలా ఉంటె, కొన్ని విషయాల్లో మాత్రం  బాబు అనుసరిస్తున్న విధానాలు చాలా దారుణంగా ఉంటున్నాయి.  అందులో ముఖ్యంగా రెండుకళ్ల సిద్ధాంతం. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో రెండు కళ్ళ సిద్ధాంతంపై ఎక్కువగా ఆధారపడి ఉండేవాడు.  రెండు రెండు కళ్ళు అని రెండింటికి సమన్యాయం చేయాలనీ చెప్పిన బాబు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత అమరావతిని స్థాపించారు.  


అమరావతి రాజధానిగా చేసుకొని పరిపాలన చేసిన సంగతి తెలిసిందే.  అయితే, ఆంద్రప్రదేశ్ రాజధాని రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేయలేదని, పైగా కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలి అంటే ఖర్చుతో కూడుకొని ఉంటుందని చెప్పి, ముఖ్యమంత్రి జగన్ అమరావతితో పాటుగా మరో రెండు రాజధానులు ఏర్పాటు చేశారు.  అయితే, ఇప్పుడు బాబు తన స్టాండ్ ను మార్చి, రెండు కళ్ళ సిద్దాంతాన్ని ఒంటికన్ను సిద్ధాంతంగా మార్చిన సంగతి తెలిసిందే.  


ఎందుకు ఇలా ఒంటికన్ను సిద్ధాంతంగా మార్చారు అనే విషయం ఆయనకే తెలియాలి.  కేవలం అమరావతి మీద మాత్రమే ప్రేమ ఉన్నదా... విశాఖ, కర్నూలు జిల్లాలపై ప్రేమ అవసరం లేదా అంటే, ఆ రెండు ప్రాంతాలు కూడా కావాలి.  కానీ, దానికంటే ముందు, అమరావతి ముఖ్యం అని అంటున్నారు.  ఎందుకో అర్ధం కావడం లేదు.  అమరావతిలో భూములు ఉన్నాయి కాబట్టి దానిపై మమకారమా లేక మరేదైనా ఉందా అనేది తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: