తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి ఊపందుకుంది. జనవరి 22న పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌చారాలు కూడా ముగిసాయి. గల్లీ గల్లీ తిరిగి విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించిన నేతలు చివరి అంకంలో ఓట‌రు ను ప్ర‌స‌న్నంచేసుకునే ప‌నిలో ప‌డ్డాయి. ఇక జనవరి 22న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జ‌ర‌గ‌గా.. 25న ఓట్లను లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడతాయి. అయితే తెలంగాణలో ము న్సిపల్ ఎన్నికలు సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా సాగుతున్నాయి.  ఇటు అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్దులు మాకు మేమే సాటి అన్నట్లుగా కాన్పిడెంట్ గా ఉంటే..ప్రతిప‌క్ష కాంగ్రెస్ కు మాత్రం ఈ ఎన్నిక‌లు జీవ‌న్మర‌ణ స‌మ‌స్యగా మారాయి. 

 

తెలంగాణ రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీలతో పాటు మరో 13 కార్పోరేషన్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ సంస్కృతిలో భాగమైన మేడారం సమ్మక్క-సారలమ్మ ఉత్స‌వాల‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం భారీ భ‌క్తులు వ‌స్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే మేడారం జాతరకు వచ్చే భక్తులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నారు. వాస్తవానికి అసలు పండుగ ఫిబ్రవరి మొదటివారంలో ఉండగా, దూరప్రాంతాల భక్తులు ముందే వచ్చి దేవతలను దర్శనం చేసుకుంటున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పోలీసులకు మేడారం జాతర విధులు అదనంగా మారాయి. 

 

ఓవైపు మున్సిపల్‌ ఎన్నికలు, మరోవైపు జాతరకు ఒకేసారి విధులు నిర్వహించాల్సి రావడంతో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కూంబింగ్‌ పెంచారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర దండకారణ్యాల నుంచి రాష్ట్రంలోకి చొరబాట్లు లేకుండా ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.  వ‌రంగ‌ల్ జిల్లా పోలీసులు బాగా మోహ‌రించారు. మేడారం జాత‌ర‌, ఎన్నిక‌లు మ‌రో వైపు న‌క్స‌ల్స్ ఇలా భారీ కాచుకుని కూర్చోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: