తెలంగాణలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ప్రచార రంగంలో దూసుకుపోయి ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఇక నిన్న సాయంత్రం తో ప్రచారం సమయం ముగిసిపోయింది. ఇక నిన్న సాయంత్రం వరకు సమయం ఉండడంతో... మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ... ప్రచార హోరు ను మరింత పెంచారు. ఇకపోతే మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభ్యర్థులందరూ భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అక్కడక్కడ డబ్బులు కూడా పంపకాలు జరుపుతున్నారు అని పలువురు భావిస్తున్నారు. 

 

 

 అయితే కేసిఆర్ ఇలాకలో మున్సిపల్ ఎన్నికల జోరు మరింత ఎక్కువగా ఉంది. ఒకప్పుడు హరీష్ రావు మాత్రమే ఈ మున్సిపల్ ఎన్నికలు అన్నింటినీ పర్యవేక్షిస్తూ గెలుపు బాధ్యతను తీసుకునే వారు ఇప్పుడు హరీష్ రావుకు  తోడు ఒంటేరు ప్రతాపరెడ్డి కూడా కావడంతో మున్సిపల్ ఎన్నికల జోరు సీఎం ఇలాకాలో మరింత పెరిగింది. ఇక రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉండడంతో... ఈ ఒక్క రోజులో ఓటర్లను ఎలాగైనా ఆకట్టుకోవాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఓటర్లకు డబ్బులు కూడా భారీగా పంచుతున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓటర్లందరికీ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ అభ్యర్థులు భారీ ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గాల్లో ఎలా ఉన్నప్పటికీ... సీఎం ఇలాకాలో ఆయన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో ఓటుకు రేటు బాగానే పలుకుతోంది. 

 

 

 సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే గజ్వెల్ ప్రజ్ఞాపూర్ లో ఓటుకు రెండు వేలు రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం... మెజారిటీ వార్డుల్లో ఓటుకు రెండు వేల తోపాటు కుంకుమ భరిణలు అందిస్తున్నారట. హుస్నాబాద్ లో ఒకటో వార్డు లో ఓటుకు నాలుగు వేల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. మెదక్ లో ఓ అభ్యర్థి ఓటరుకు కనుము, కుంకుమ భరిణె అందజేస్తున్నారట . ఇలా భారీ మొత్తంలోనే ఓటర్లకు అభ్యర్థులను ముట్టచెపుతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి అనుకుంటున్న అభ్యర్థులు ఖర్చు విషయంలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదట. ఇక సీఎం నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా ఉంటుంది కాబట్టి... ఏ ఒక్క వార్డు ఓడిపోయినా.. దాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతూ ఉంటాయి. దీంతో ఎలాగైనా గెలవాలని భారీగానే ఖర్చు చేస్తున్నారట అభ్యర్థులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: