తెలంగాణ రాష్ట్రానికి నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటు పాలన సాగిస్తున్న కేసీయార్‌కు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ గండం గడిచిందంటే, తన ఆధిపత్యానికేం ఢోకా లేదనే ధీమాలో ఉన్నాడు. ఇప్పటికే ఎన్నికల్లో వరుస విజయాలతో అత్యధిక మెజార్టితో తన అభ్యర్ధులను గెలిపించుకుంటూ, పార్టీ ప్రతిష్టకు ఇసుమంతైనా భంగం వాటిల్లకుండా విజయాన్ని తన చంకలో పెట్టుకుని ముందుకు సాగుతున్న ఈ గులాభి బాస్‌కు ఈ పోరుతో తన కారుకు కాస్త బ్రేక్ పడుతుందని అనుకుంటున్నారట.

 

 

ఇకపోతే ఇప్పటికే అసంతృప్తితో సొంత పార్టీ వారే మరిగే నూనెలా సలసల కాగుతుండగా, ఒక వైపు ప్రతిపక్షాలు కనీసం ఈ ఎన్నికల్లోనైనా తమ పార్టీ ఇంకా బ్రతికే ఉందని నిరూపించు కోవాలని తాపత్రయ పడుతున్నారట. అంతే కాకుండా ఇప్పటికే కేసీయార్.. మున్సిపల్ పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులకు చెప్పిన విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఓటమికి, గెలుపుకు మీదే బాధ్యత అని హెచ్చరించగా, కొందరిలో కొంత భయం కూడా పట్టుకుందట. అంతే కాకుండా  రాష్ట్రవ్యాప్తంగా 14 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు మునిసిపల్‌ ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని సమాచారం..

 

 

ఇక అసెంబ్లీ స్థానాలు రాష్ట్రంలో మొత్తం కలిపి 119 ఉండగా ఇందులో ఏ లెక్కన తీసుకున్న టీఆర్ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేల బలం ఉందని సమాచారం. కాగా తెలంగాణ రాష్ట్రం మొత్తం లో 86 మంది ఎమ్మెల్యేలు మునిసిపల్‌ ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటుండగా.. వారిలో 83 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పరిధిలోనే 116 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్‌, మెదక్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, వీరంతా తమ పార్టీని ఎలాగైనా గెలిపించాలని అన్న బాస్ ఆదేశాల విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి..

 

 

ఈ పరిస్దితుల్లో టీఆర్ఎస్‌ లోకి వలస వచ్చిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కూడా కొంత సెగ తగులుతుందట. అలాగే మరికొన్ని మునిసిపాలిటీలు కూడా అధికార పార్టీకి సవాల్‌గా మారాయంటున్నారు. ఇలా తెలంగాణాలో తలనొప్పిగా తయారైనా కొన్ని మున్సిపాలిటీలను పరిశీలిస్తే, అందులో కొల్లాపూర్‌, గద్వాల అయిజలో, అలంపూర్‌లో, కొత్తగా ఏర్పడిన ఎల్లారెడ్డి, కొత్తగూడెం, నారాయణఖేడ్‌ మునిసిపాలిటీలో, ఖానాపూర్‌, మహబూబాబాద్‌, జనగామ మొదలైనా మునిసిపాలిటీలో సొంత పార్టీ వర్గాల్లోనే విభేదాలు బయటపడుతుండగా దీనికి తోడుగా చైర్మన్‌ రేసులో ఉన్న అభ్యర్థుల మధ్య కీచులాటలు, కోవర్టు ఆపరేషన్లతో పుర పోరులో ఎదురీదక తప్పడం లేదు.

 

 

పార్టీకి చెందిన రెబల్స్‌తోపాటు పుంజుకున్న కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులతో అధికార పార్టీకి విజయం ప్రస్తుత పరిస్దితులో చాలా ఇబ్బందికరంగా మారింది. ఇకపోతే కేసీయార్ పధకాలు, మాటలు ఈ ఎన్నికల్లో ప్రజలపై ఎంతగా ప్రభావాన్ని చూపాయో తెలియాలంటే రిజల్ట్ వరకు ఆగవలసిందే అని అనుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: