తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం రెండో రోజు ప్రారంభమయ్యాయి. అత్యంత వివాదాస్పదమైన పరిపాలన  వికేంద్రీకరణ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. అదే విధంగా ఇటీవల ప్రతిష్టంకంగా అమలుపరుస్తున్న అమ్మ ఒడి, రైతు భరోసా బిల్లులపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరగనున్నది.  అంతే కాకుండా శాసన మండలిలో సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను ఏపి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఇదిలా ఉండగా  జనసేన, బిజెపి పార్టీల సమావేశం కానున్నాయి. ఈ ఉభయ పార్టీల అవగాహన ఒప్పందం కుదిరిన తర్వాత మొదటసారి సమావేశమవుతున్నారు.

అది కూడా రాష్ట్ర రాజధాని అంశంగా చేపట్టిల్సిన కార్యాచరణను ఖరారు చేయనున్నట్టు సమాచారం. సమావేశం   అనంతరం రాజధాని పై  ఇరు పార్టీల నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ లు తమ అజెండా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.  ఇదిలా ఉండగా బిజెపి ఆధ్వర్యంలో రాజధాని బిల్లు కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించతల పెట్టింది. కాగా  రాజధాని గ్రామాల్లో బంద్ కు పిలుపు రైతులు పిలుపు ఇచ్చారు.  అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది. నిన్న జరిగిన సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పాలనా రాజధానిగా విశాఖపట్నం ఖరారైంది. హైకోర్టు కర్నూలుకు తరలిపోనుంది.

శాసన రాజధాని గానే అమరావతి పరిమితం కానుంది. ప్రాంతాల వారీగా అభివృద్ధికి ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు అంశాన్ని కూడా ఈ బిల్లులో చేర్చారు. దీంతో  ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీసీఆర్ డీఏ చట్టం రద్దు బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చను ప్రారంభించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని..

వీటిని  రూపుమాపేందుకు తమ సర్కారు చర్యలు తీసుకుబోతోందని తెలిపారు. దీంతో ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు ప్రధాన పరిపాలనా వ్యవహారాలు విశాఖకు తరలిపోవటం ఖాయం అని తేలిపోయింది.  అమ్మ ఒడి, రైతు భరోసా కేంద్రాలపై నేటి సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యేక ఎస్సీ కమిషన్‌ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా. జగన్‌ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: