క్ష‌ణికావేశంలో చేసే ప‌నుల వ‌ల్ల కొన్ని జీవితాలు నాశ‌న‌మైపోతాయి. ఏ ప‌ని చేసినా కాస్త ఆలోచించి అడుగులు వేయాలి. అందులోనూ ఆడ‌పిల్ల‌లు ప్ర‌స్తుతం ఉన్న స‌మాజ ప‌రిస్థితుల వ‌ల్ల ఇంకాస్త ఎక్కువ జాగ్ర‌త్త వ‌హించ‌డం చాలా మంచిది. బంధాలు, సంబంధాల‌కి ప్ర‌స్తుతం కాలంలో విలువ‌లు చాలా త‌క్కువ‌యిపోయాయి. కొంద‌రు ఆచార వ్య‌వ‌హారాలిని మంట‌గ‌లిపి ప్ర‌వ‌ర్తిస్తున్నారు.పెళ్ళి, విడాకులు ఇలాంటి వాటి పై క‌నీస గౌర‌వం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు నేటి యువ‌త‌. పెళ్ళైన వారం రోజుల‌కే మ‌రొక‌రితో వెళ్ళిపోయి. తిరిగి భ‌ర్త పైన కేసు పెట్ట‌డం లాంటి ఘ‌ట‌న ఇటీవ‌లె మ‌ధ్య ప్ర‌దేశ్ రాజ‌ధాని భూపాల్ లో చోటుచేసుకుంది. 

 

వివ‌రాల్లోకి వెళితే... మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భూపాల్‌లో కోలార్ ప్రాంతానికి సంబంధించిన ఓ యువ‌తిని ప్రైవేట్ సంస్థ‌లో ఎకౌంటెంట్‌గా ప‌నిచేస్తున్న యువ‌కుడికి ఇచ్చి గ‌త ఏడాది వివాహం చేశారు. అయితే ఈ యువ‌తికి అంత‌కు ముందే టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్న యువ‌కుడితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తుంది. ఈ విష‌యాన్ని ఆమె త‌ల్లిదండ్రుల‌కు తెలిపింది. కానీ వారి ప్రేమ‌ను అంగీక‌రించ‌ని పెద్ద‌లు బ‌ల‌వంతంగా ఆమెను ఎకౌంటెంట్‌కి ఇచ్చి వివాహం చేశారు. పెళ్ళైనా కూడా ప్రియుడి ప్రేమ‌ను మ‌ర్చిపోలేని ఆమె భ‌ర్త‌కు అస‌లు విష‌యం చెప్పేసింది. దీంతో భ‌ర్త గొప్ప‌మ‌నుసుతో ఆమెను ప్రియుడి వ‌ద్ద‌కు వెళ్లి ఉండ‌మ‌ని అత‌న్నే వివాహం చేసుకోమ‌న్నాడు. వివాహం జ‌రిగిన వారం రోజుల‌కే ఆమె భ‌ర్త‌ను వ‌దిలి వెళ్ళిపోయింది. దాంతో ఇద్ద‌రూ కూడా నోట‌రీ పైన సంత‌కాలు చేసి ఇంక లైఫ్ లో ఎప్పుడూ కూడా ఒక‌రివ‌ల్ల మ‌రొక‌రికి ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా విడాకులు తీసుకున్నారు. దాంతో ఆమె ప్రియుడి వ‌ద్ద‌కు వెళ్లి కొన్ని రోజులు స‌హ‌జీవ‌నం చేయ‌సాగింది. మ‌ళ్ళీ తిరిగి కొద్ది రోజుల త‌ర్వాత మ‌రి వారిద్ద‌రి మ‌ధ్య ఏమైనా మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయో ఏమో తెలియ‌దు కానీ త‌న త‌ప్పును తెలుసుకుని తిరిగి భ‌ర్త వ‌ద్ద‌కు వ‌చ్చింది. ఆమెను ఏలుకోమ‌ని ప్రాధేయ‌ప‌డింది. దానికి స‌సేమిరా అన్నాడు భ‌ర్త‌. అందుకు భర్త మాత్రం అంగీక‌రించ‌లేదు. దీంతో భార్య భ‌ర్త నుంచి భ‌ర‌ణం కావాలంటే కోర్టులో కేసు వేసింది.  భ‌ర్త కూడా ఆమెతో త‌న‌కు విడాకులు కావాలంటూ పిటీష‌న్ వేశాడు. 

 

పెళ్ళైన వారం రోజుల‌కే భ‌ర్త‌ను వ‌దిలిపెట్టి వేరొక‌రితో వెళ్ల‌డంతో భ‌ర్త‌కు అనుకూలంగా కోర్టువారు తీర్పునిచ్చారు. పెళ్ళైనా కూడా భ‌ర్త‌ను వ‌దిలి ప్రియుడి వ‌ద్ద‌కు వెళ్ల‌డంతో త‌న‌కు భ‌ర‌ణం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇష్ట‌పూర్వ‌కంగానే విడిపోయిన‌ప్పుడు భ‌ర‌ణం ఇచ్చేది లేదంటూ కోర్టు తేల్చి చెప్పేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: