డబ్బు సంపాదించిన ప్రతివాడు ధనవంతుడు కాలేడు. ఆ సంపదను సద్వినియోగం చేసుకున్నవాడు మాత్రమే ధనవంతుడు కాగలడు. ముఖ్యంగా సంపద విషయంలో సరైన దృక్పదం ఉన్నవాడు మాత్రమే ఐశ్వర్య వంతుడుగా కొనసాగ గలుగుతాడు.

ప్రతి వ్యక్తికి డబ్బు అవసరం అయితే ఆ డబ్బుతో ప్రతి వస్తువును కొనగలము అని  భ్రమిస్తే డబ్బు కొనలేనివి ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. డబ్బుతో పుస్తకాలను కొనగలం కాని విజ్ఞానాన్ని కొనలేము. అదేవిధంగా డబ్బుతో ఆభరణాలను కొనగలం కాని సౌదర్యాన్ని కొనలేము. అంతేకాదు ఇంటికి కావలసిన విలాస వంతమైన వస్తువులను కొనగలం కాని కుటుంబాన్ని కొనలేము.

కొంతమంది జీవితంలో చాల కష్టపడి స్థిరాస్తులను కొంటారు. అయితే వారి ఇంటిలో ఎప్పుడు డబ్బు కొరత ఉంటూనే ఉంటుంది. ఆస్థులను మిగల్చాలి అనే ఆరాటంతో తమ వద్ద కనీస అవసరాలకు కూడ డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి గల కారణం చాలామందికి ఆస్థుల పై ఎంత పెట్టుబడి పెట్టాలి లిక్వీడ్ క్యాష్ రూపంలో ఎంత తమ వద్ద ఉంచుకోవాలి అన్న విషయంలో అవగాహన లేకపోవడమే. దీనితో డబ్బును సంపాదించడమే కాదు ఆ డబ్బును సద్వినియోగం చేసుకోగల సమర్థత ఉండాలి.

మన డబ్బు మన అవసరాలతో పాటు మరో నలుగురి అవసరాలు తీర్చగలగాలి అంటే డబ్బును ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. అంతేకాదు ఎదో ఒక వ్యాపారంలోనో లేదంటే ఒక పెట్టుబడి రూపంలోనూ మన దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడిగా మార్చగలిగినప్పుడు మాత్రమే ఆ డబ్బు సంపదగా మారే ఆస్కారం ఉంది. దీనితో డబ్బును మన అవసరాలకు తీర్చుకోవడానికి వాడుకుంటూ మిగిలిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినప్పుడు మాత్రమే మన డబ్బు సంపదగా మారే అవకాశాలు ఎక్కువ అదే నిజమైన సంపద రహస్యం. ఒక కిలో బంగారాన్ని గనిలోంచి బయటకు తియ్యాలి అంటే ముందుగా వచ్చే కొన్ని వేల టన్నుల మట్టిని చూసి నిరుత్సాహ పడకూడదు. అలాగే డబ్బును సంపాదించాలి అని కోరుకునే ప్రతి వ్యక్తికి చాల ఓర్పు ఉండాలి అప్పుడే అతడు సంపదను సృష్టించి కాపాడుకోగలుగుతాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: