నిజంగానే అమెరికాతో కెపాసిటితో  పోల్చుకుంటే ఇరాన్ చిట్టెలుకనే చెప్పాలి. అలాంటి చిట్టెలుకే ఇపుడు అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తాజాగా ఇరాక్ లోని అమెరికా ఎంబసీ కార్యాలయంకు సమీపంలో మూడు రాకెట్లు పేలటంతో  అమెరికాలో టెన్షన్ పెరిగిపోతోంది. పోయిన నెలలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం  సులేమానీని అమెరికా ఇరాక్ విమానాశ్రయంలో చంపేసిన విషయం తెలిసిందే.

 

ఖాసిం అంటే మామూలు వ్యక్తికాదు. ఇరాన్ అధ్యక్షుడు అయుతుల్లా ఖొమేనీకి దేశంలో ఎంతటి ఆధరణందో అంతకు సమానమైన ఆధరణ ఉన్న వ్యక్తి ఖాసిం. ఇరాన్ తరపున చాలా దేశాల్లో మిలిటరీ వ్యవహారాలు చక్కబెట్టటంలో సులేమానీ వ్యూహాలు కీలకమైనవి. ఇరాన్ దేశం నుండి ముందు మందు తమకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందుగా మిలటరీ కమాండర్ ను హతమార్చటమే ఏకైక మార్గంగా అమెరికా అనుకున్నది. అనుకున్నట్లే పక్డబందీగా వ్యూహం పన్ని ద్రోన్ బాంబులతో చంపేసింది.

 

అయితే ఖాసింని హతమార్చిన తర్వాత తలెత్తిన పరిణామాలు అమెరికాలో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే ఖాసం మరణానికి ప్రతీకారంగా  ఇరాన్  సైనికులు ఇరాక్ లో అమెరికా సైనిక దళాల క్యాంపులపై మూడుసార్లు క్షిపణి దాడులు చేసింది. రెండోసారి జరిపిన దాడిలో సుమారు 80 మంది అమెరికా సైనికులు మరణించినట్లు ఇరాన్ మిలిటరీ ప్రకటించినా అమెరికా కొట్టి పారేసింది. కాకపోతే  తాము దాడి చేసిన ప్రాంతాలను ఇరాన్ మ్యాపులతో సహా వీడియోలను  విడుదల చేసింది. దాని ప్రకారం అమెరికా  దళాలు క్యాంపులకు పెద్ద ఎత్తున నష్టాలు జరిగినట్లు కనిపిస్తోంది.

 

సరే ఆ విషయాన్ని పక్కన పెడితే తాజాగా ఇరాక్ లోని హై సెక్యురిటి జోన్ లో  ఉన్న అమెరికా ఎంబసి పక్కనే మూడు రాకెట్లు పేలాయి. దాంతో   జరిగిన నష్టం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా బయటపడలేదు. ఇరాన్ వరస చూస్తుంటే అమెరికాను ఇప్పట్లో వదిలి పెట్టేట్లు లేదు. ఏదోరకంగా ఖాసిం హత్యకు ప్రతీకారంగా ప్రతీకారం తీర్చుకునేట్లే అనుమానంగా ఉంది. ఆ ప్రతీకారం ఏ రూపంలో ఉంటుందో ? ఎక్కడ నుండి మొదలవుతుందో ? తెలీకే అమెరికా నానా అవస్తలు పడుతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: