కొన్ని కొన్నిసార్లు పెట్టుకున్న నమ్మకం వమ్మయితే, ఆసమయంలో సందర్భానికి తగ్గట్టుగా ఒక సాంగ్ ప్లే చేస్తారు. అదేమంటే అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. వినడానికి భలేగా ఉన్నా, ఈ పాట కొందరికి అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. ఇకపోతే తెలంగాణాలో జరిగిన గత లోక్ సభ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన ఘటన అందరికి గుర్తుండే ఉంటుంది. అదేమంటే సొంత బావబామ్మర్దులు అయినా హరీష్ రావు, కేటీఆర్ మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంది.

 

 

ఇక గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొనెందుకు మెదక్ జిల్లాకు వెళ్లినప్పుడు మెదక్ ఎంపీ స్థానంలో వచ్చే ఓట్లకన్నా.. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటరీలో రెండు ఓట్లు ఎక్కువే తెచ్చుకుంటామే తప్ప ఎక్కడా తగ్గబోమని సవాల్ విసిరారు. తీరా ఫలితాలు చూస్తే మాత్రం మెదక్‌లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ కు బ్రహ్మాండమైన మెజార్టీ వస్తే.. కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ స్థానం మాత్రం చేజారి పోయింది. అక్కడ బీజేపీ వచ్చింది.. అది ముగిసిన ఇన్ని రోజులకు మళ్లీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి ఈ బావబామ్మర్దులు ఢీకొన బోతున్నారు.

 

 

ఇదెలా అంటే హ‌రీష్ ఉమ్మ‌డి మెద‌క్ పోల్స్ ప‌ర్య‌వేక్షిస్తుండగా, కేటీఆర్ ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ మునిసిపోల్స్‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. సేం టూ సేం సిట్యుయేషన్. కాని అవి లోక్‌సభ ఎన్నికలు కాగా, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్సన్స్.. మరి ఇదివరకటి సిట్యుయేషన్ సేం టూ సేం గా రిపీట్ చేస్తారా.. లేక కేటీయార్ తన సారధ్యంలో విజయాన్ని సాధిస్తాడ అనేది సొంత పార్టీలో చర్చాంశనీయంగా మారిందట.. ఇకపోతే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మాటలతో ప్రజలను కమాండ్ చేయడంలో వీరిద్దరిది చేరో దారి. తూటాల లాంటి మాటలతో, కేటీయార్ దడదడలాడిస్తే, హారీష్ రావు మాత్రం తన ప్రసంగాన్ని అటం బాంబులా కొనసాగిస్తూ, నవ్వులతోనే ప్రత్యర్ధులను ఎదుర్కొంటాడనే పేరు ఉంది.

 

 

ఇదే కాకుండా మెదక్ నియోజక వర్గంలో తెలంగాణ ఉద్యమం మొదలు కాకముందు నుండి హారిష్ రావు తన స్దానాన్ని సుస్దిర పరచుకున్నాడు. ఇకపోతే కేటీయార్ మాత్రం అంతగా తన పాగా వేయలేదని అనుకోవచ్చు. దీనికి ఉదాహరణ  కరీంనగర్ లో  బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 89 వేల 508 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా. మెదక్ కంటే ఒకటో, రెండో ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటామని బావతో బామ్మర్ది ఛాలెంజ్ చేసినా.. ప్రజలు మాత్రం విలక్షణమైన తీర్పు ఇచ్చారు.

 

 

కేటీఆర్ సవాల్ విసిరినట్లు ఒకటి, రెండు ఓట్లు ఎక్కువ రావడం సంగతేమో గానీ.. అసలుకే ఎసరొచ్చి కరీంనగర్‌లో టీఆర్ఎస్ బొక్కబొర్లా పడింది. మరి ఈ సారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అయినా తన బావ పై ఈ బామ్మర్ధి అత్యధిక మెజార్టీని సాధించి గత ఎన్నికల్లో తప్పిన మాటను ఈసారైనా నిలబెట్టుకుంటాడో లేదో అని అనుకుంటున్నారట. కారుడిక్కిలో కూర్చున్న కొందరు నాయకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: