జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయన ప్రతి కదలిక అనుమానాస్పదంగానే ఉంటూ వస్తోంది. దీనిపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నా, అందరిలోనూ చులకన అవుతామని తెలిసినా పవన్ మాత్రం ఆ పద్ధతి మార్చుకోకుండా మరింతగా జనాల్లో పలుచన అయిపోతున్నాడు. ఆయన చంద్రబాబు ఆడించే కీలు బొమ్మ, పార్టనర్ అంటూ ఆయనపై అనేక విమర్శలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే పవన్ రాజకీయం కూడా ఉంటూ వస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పై విమర్శలు చేసాడు పవన్. అప్పట్లో టీడీపీ బీజేపీ కలిసి ఉన్నప్పుడు ఆ రెండు పార్టీల మనిషిగా పవన్ ముద్ర  వేయించుకున్నారు. 

 

టీడీపీ బీజేపీ పొత్తు తెగ తెంపులు అయినప్పుడు బీజేపీ పై పవన్ విమర్శలు చేసి తన స్వామి భక్తిని నిరూపించుకున్నాడు. ఎన్నికల ముందు నుంచి వైసీపీకి బీజేపీ అన్ని రకాలుగా సహాయా సహకారాలు అందించడంతో బీజేపీ పై తీవ్ర స్థాయిలో పవన్ విమర్శలు చేయడమే కాకుండా హిందుత్వ అజెండాపైనా కామెట్స్ చేసాడు. ఇక ఏపీలో టీడీపీ భవిష్యత్తు అయోమయంలో పడడంతో కొంతమంది తన బినామీలుగా పేరున్న సన్నిహితులను బీజేపీలోకి పంపిన బాబు ఇప్పుడు పవన్ ని కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందిగా సుంచించడంతోనే ఆయన ఇలా హడావుడిగా పొత్తు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 

 

ప్రచారం పవన్ ను ప్యాకేజి స్టార్ గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన వ్యవాహారం కూడా అనుమానాస్పదంగా ఉంటోంది.  
పవన్ ఇప్పుడు బీజేపీలో కలిసినా ఆయనకు చంద్రబాబే అధిష్టానం అన్నట్టుగా స్వామి భక్తిని ప్రదసిస్తున్నారని, ఇలా ఎటు అవకాశం ఉంటే అటు దూకుతూ, ఒక్క మాట మీద కూడా పవన్ నిలబడకుండా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతుండడంపై వైసీపీ కూడా అదే రేంజ్ లో కౌంటర్ లు ఇస్తోంది. పవన్ ఉదయం షూటింగ్స్ చేస్తూ సాయంత్రం బాబు సూచనలతో యాక్టింగ్ చేస్తున్నారని వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు బాబు సలహాలతో బీజేపీతో ప్యాకేజ్ మాట్లాడుకుని రాజకీయాల్లో పవన్ బాగా నటిస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న విమర్శల్లో నిజం లేకపోలేదు అని జనాల్లో చర్చ నడుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: