ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానిల  ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష పార్టీన టీడీపీ  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన చేసిన...  రాజధాని రైతులు కూడా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయకుండా మూడు రాజధానిల బిల్లును అసెంబ్లీలో ఆమోదం ముద్ర వేయించింది జగన్ సర్కార్. ఇక శాసనమండలిలో 3 రాజధానిల బిల్లు ఆమోదం తెలిపితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక్కటే కాదు విశాఖ కర్నూలు కూడా మరో రెండు రాజధానులు మారనున్నాయి. ఇకపోతే జగన్మోహన్  రెడ్డి  మూడు రాజధానుల  ప్రకటన చేసినప్పటి నుంచి... బిజెపి ఎటు తేల్చుకోలేని పరిస్థితి లోనే ఉంది. మద్దతు ప్రకటించాల వద్దా అని బిజెపి నేతల్లోనూ క్లారిటీ లేకుండా పోయింది. పలుమార్లు జగన్ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామని ప్రకటిస్తే... కొన్నిసార్లు మద్దతు తెలపడం లేదన్న విమర్శలు చేశారు బిజెపి నేతలు. 

 

 

 ఇక తాజాగా  మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మించ తలపెట్టిన మూడు రాజధానిలో పై మీడియా సమావేశంలో మరోసారి బిజెపి కీలక నేతలైన జివిఎల్,  కన్నా లక్ష్మీనారాయణ లు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని మార్పు అనేది కేవలం జగన్ సర్కార్ స్వార్థ ప్రయోజనాల కోసమే చేస్తోందని ఆరోపించారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసి  ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని ఆరోపిస్తున్న జగన్ సర్కార్ కి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు ఎలాంటి అవకాశం లేకపోవడంతో రాజధాని విశాఖ కు తరలించి విశాఖలో.. భూ అక్రమ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 

 

 

 ఈ సందర్భంగా మాట్లాడిన జీవీఎల్... రాజధానిని మొత్తం విశాఖపట్టణానికి తరలించి కేవలం చట్టసభలను అమరావతిలో ఉంచుతామని జగన్ సర్కార్  చెబుతోందని అది రాజధాని అని ఎవరూ అనుకోరు  ఆరోపించారు. కర్నూలులో హైకోర్టు నిర్మించి  అది ఒక ప్రత్యేకమైన రాజధాని అని జగన్మోహన్ రెడ్డి  సర్కార్ చెబుతుందని... హైకోర్టు నిర్మించిన అంతమాత్రాన రాజధాని ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించారు. అయితే జగన్ సర్కార్ తీసుకున్న 3 రాజధానిలో నిర్ణయానికి కేంద్ర మద్దతు తెలుపుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాజధాని మార్పు కోసం జగన్ మోహన్ రెడ్డి సర్కారు చెబుతున్నా  కారణాలేవి... సహేతుకంగా లేవు అంటూ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: