నేడు అత్యవసర అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా  అసెంబ్లీ సమావేశానికి ముందు మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేస్తున్న నాటకాల మందు... గొప్ప నటులైన జగ్గయ్య ప్రకాష్ రాజు కూడా పనికిరారు  మండిపడ్డారు. మేమిద్దరం  ఒకే ప్రాంతంలో పుట్టి  పెరిగిన వాళ్లమని...  ఒకే వర్సిటీ లో  కూడా చదివాము అంటూ గుర్తు చేసారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.తాను   అప్పుడే పీహెచ్డీ పూర్తి చేస్తే...  ఇప్పటికీ చంద్రబాబు మాత్రం చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టదని 3 రాజధానులు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చెందుతాయని నిపుణుల కమిటీలు చెబుతున్నాయని.... రాష్ట్రాన్ని అభివృద్ధి లో పరుగులు పెట్టించే ఇలాంటి నిర్ణయం ఓ పెద్ద మనిషిగా స్వాగతించాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం వ్యతిరేకిస్తున్నారు అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 

 

 

 రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రాంతాలపై అనవసర అసత్య ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ స్వలాభాలను  కాపాడుకుంటూ తన బినామీ ఆస్తులను రక్షించడమే ఉద్దేశ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు సహా టిడిపి నేతలు అందరూ తమతమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే... మూడు రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటూ మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు నిర్మించవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ చెప్పాలంటూ చెవి రెడ్డి సవాల్ విసిరారు. 

 

 రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ  న్యాయం చేసి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రాంతీయ విద్వేషాలను వదిలేసి రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నిర్ణయానికి అభివృద్ధి వికేంద్రీకరణ సహకరించాలని కోరారు. ఇకపోతే నిన్న అసెంబ్లీలో ఆమోదం పొందిన మూడు రాజధానిల బిల్లు... ఈరోజు శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో శాసనమండలిలో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: