చంద్రబాబునాయుడు ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోంది. జరుగుతున్నదేంటో అర్ధంకాకే అవస్తలు పడుతున్నాడు. తాజాగా జరుగుతున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో  ఈ విషయం స్పష్టమైపోయింది.  మూడు రాజధానుల పై అసెంబ్లీలో  సోమవారం రాత్రి చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.  చర్చంటూ జరిగిన తర్వాత ఎవరి వాదనకు వాళ్ళు కట్టుబడున్నారు.

 

నిజానికి గడచిన 35 రోజులుగా రాజధాని గ్రామాల్లో కానీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా  చంద్రబాబు వినిపిస్తున్న వాదనలో కొంచెం కూడా అసెంబ్లీలో వినిపించలేకపోయారు. అంటే చంద్రబాబు ఫెయిలయినట్లే అనుకోవాలి. సరే అసెంబ్లీలో ఫెయిలయ్యారని సరి పెట్టుకుంటే అసెంబ్లీ బయట కూడా విఫలమైనట్లుగానే ఉంది.

 

మూడు రాజధానులపై  అసెంబ్లీలో ఓటింగ్  జరిగిన తర్వాత సోమవారం రాత్రి  అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన చంద్రబాబు అక్కడే మెట్లపై ధర్నా చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  అసెంబ్లీ మెట్లపై ధర్నా చేసిన చంద్రబాబుకు పార్టీ నేతల నుండి ఎటువంటి సహకారం అందకపోవటం. అసెంబ్లీలో ఉన్న ఎంఎల్ఏలు కూడా చంద్రబాబుతో పాటు ధర్నాలో కూర్చోలేదు.

 

సభలో గోల చేస్తున్నారన్న కారణంతో ఎనిమిది మంది ఎంఎల్ఏలను స్పీకర్ అసెంబ్లీలో నుండి బయటకు పంపేశారు. మరి మిగిలిన 13 మంది ఎంఎల్ఏలు సభలోనే ఉన్నారు కదా. మరి వాళ్ళు కూడా చంద్రబాబుతో పాటు ఎందుకు ధర్నాలో పాల్గొనలేదు ? అసెంబ్లీ సమావేశం ముగియగానే  చంద్రబాబు వెళ్ళకుండా మిగిలిన వాళ్ళు అక్కడి నుండి వెళ్ళరు. మరి సోమవారం రాత్రి అసెంబ్లీ దగ్గర ఏమి జరిగిందో తెలీదు.

 

మొత్తానికి  చంద్రబాబు అసెంబ్లీ మెట్ల మీదే కూర్చుని  ధర్నా చేస్తున్నా మరి మిగిలిన ఎంఎల్ఏలు ఎందుకు దూరంగా ఉండిపోయారో ఎవరికీ అర్ధం కాలేదు. చంద్రబాబు సెక్యురిటి, బ్లాక్ క్యాట్లు, టిడిఎల్పి సిబ్బంది తప్ప ఇంకెవరూ లేరు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు చేష్టలతో పార్టీ ఎంఎల్ఏలే విభేదిస్తున్నట్లు అనుమానంగా ఉంది. లేకపోతే ఫార్టీ ఇయర్స్  ఇండస్ట్రీనే పార్టీలో  ఒంటరైపోవటం ఏంటి ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: