ఏ వంకా లేనోడు డొంకట్టుకుని వేలాడాడు అనే సామెత గుర్తుంది కదా గుర్తు లేకపోయినా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరగణం చేస్తున్న, చెబుతున్న రాజకీయాలు వింటే వెంటనే ఈ సామెత గుర్తుకు వచ్చేస్తుంది. టీడీపీ నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మూడు రాజధానులు ఏపీకి రావడం వలన మేలే జరుగుతుంది తప్ప ఎక్కడా , ఎవరూ నష్టపోయిది ఏమీ లేదు. మూడు ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించడం వల్ల ఏపీ సమానంగా అభివృద్ధి చెందడంతో పాటు ఎక్కడా ప్రాంతీయ వైషమ్యాలు రావు. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రాంబాబు కి కూడా బాగా తెలుసు. అయినా ఏదో ఒక బురద జగన్ ప్రభుత్వంపై చల్లకపోతే రాజకీయం ఇంకా మునిగిపోయే ప్రమాదం ఉండనే భయంతో బాబు ఈ నాటకాలకు తెర లేపడానే విమర్శలు వస్తున్నాయి. 


బాబు కమ్మ సామజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఆయన మీద, ఆయన సామజిక వర్గం మీద ఉన్న కోపంతో జగన్ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చుతున్నారని చంద్రబాబు, ఆయనకు చెందిన అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వాస్తవంగా చూస్తే అమరావతి పరిసర గ్రామాల్లో కమ్మ, కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందుకే జగన్ రాజధానిని మార్చుతున్నాడు అనుకుంటే విశాఖలోనూ ఆ సామజిక వర్గాల హవానే ఎక్కువ నడుస్తోంది. ఇక్కడ నుంచి పోటీ చేసి ఎంపీలుగా గెలిచిన వారంతా కమ్మ  సామాజిక వర్గానికి చెందిన ఎంపీలే.


 ఇప్ప‌డు ఉన్న వైసీపీ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ కూడా క‌మ్మ సామజిక వర్గానికి చెందిన వారే. ఇక టీడీపీలో ఉన్న ఎంవీవీ ఎస్ మూర్తి ఫ్యామిలీ, మొన్న టీడీపీ నుంచి పోటీ చేసిన చంద్రబాబు వియ్యకుండు నందమూరి బాల‌య్య అల్లుడు భ‌ర‌త్‌, బీజేపీ నుంచి గతంలో గెలిచిన పురందేశ్వ‌రి, కంభంపాటి హ‌రిబాబు ఇలా వీరంతా కమ్మ సామజిక వర్గానికి చెందిన వారే. అంటే టీడీపీ, బీజేపీ, వైసీపీ ఎంపీలు గా కూడా క‌మ్మ‌ సామజిక వర్గానికి చెందిన వారే గెలిచారు. ఇక కాపు సామజిక వర్గాన్ని చూసుకుంటే అక్క‌డ మంత్రులుగా గంటా శ్రీనివాస్‌, అవంతి శ్రీనివాస్‌లు ప‌ని చేశారు. వీళ్లు కాపులు. ఈ లెక్కన చూసుకుంటే ఇక్కడ రెడ్ల హావా లేదు అని తేలిపోయింది. 


ఒక వేళ జగన్ కు కుల పిచ్చి ఉంది ఉంటే రాజధానిగా విశాఖకు బదులుగా ఉంటే  కడప, కర్నూలో, నెల్లూరో, ఒంగోలో, దొనకొండ, వీటిల్లో ఏదో ఒకటి రాజధానిగా ఎంపిక చేసి జగన్ తన సామజిక వర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఉండేవారు. కానీ జగన్ అలా చేయలేదు. కేవలం ప్రాంతాల అభివృద్ధి ని దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్తున్నాడు అనే విషయం ఇంత స్పష్టంగా అర్ధం అవుతున్నా లేనిపోని ఆరోపణలు చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు తన విశ్వసనీయతను రోజు రోజుకి తగ్గించుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: