అసెంబ్లీ సమావేశాల్లో బుగ్గన రాజేంద్రనాథ్ లేచి మాట్లాడుతున్నాడంటే చంద్రబాబుకు, బాబోరి బ్యాచ్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపక్ష పార్టీ నేతలను విమర్శిస్తూనే ప్రతి అంశాన్ని లెక్కలతో సహా చెప్పి విపక్షాలను ఏకిపారేస్తారు. నిన్న మూడు రాజధానులను సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బుగ్గన మూడు రాజధానులను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందో కూడా వివరించి టీడీపీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని గురించి ప్రకటన రాకముందే తెలుగుదేశం పార్టీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడటంతో పాటు 4070 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని బుగ్గన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిపై చంద్రబాబు అధికారంలోకి రాకముందే కుట్ర జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా పెట్టాలని చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. 
 
అమాయకపు రాజధాని రైతులను చంద్రబాబు మోసం చేశాడని రాజధానిని ప్రకటించక మునుపే తెలుగుదేశం పార్టీ నేతలు భూములు కొనుగోలు చేశారని లక్షల్లో భూములను కొని ఎకరం పది కోట్ల రూపాయలకు తెలుగుదేశం పార్టీ నేతలు అమ్ముకున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు 40,000 కోట్ల రూపాయల కుంభకోణం చేశారని బుగ్గన సంచలన ఆరోపణలు చేశారు. అమరావతిలో ఎక్కడ ఎవరు ఎంత భూములను కొన్నారో బుగ్గన లెక్కలతో సహా చెబుతూ ఉండటంతో షాక్ అవ్వడం టీడీపీ నేతల వంతవుతోంది. 
 
బుగ్గన రాజేంద్రనాథ్ రాజధానిగా అమరావతి గురించి ప్రకటన చేయక ముందే చంద్రబాబు నాయుడు 14.2 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు చేశారు. సాక్షాత్తూ రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు భూములు కొనుగోలు చేశాడని చెప్పడంతో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపితమైంది. చంద్రబాబు ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారని చెప్పటం మరియు .. ఏ విష‌యంలో అయినా పుట్టు పుర్వోత్త‌రాల నుంచి లెక్క‌ల‌తో చెప్ప‌డంతో అటు విప‌క్ష నేతల నుంచి అస్స‌లు కౌంట‌ర్లు ఉండ‌డం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: