గత ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలైన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చడం వంటి అంశాలను పూర్తిగా తుంగలో తొక్కిన బాబు ప్రభుత్వానికి, అలానే టిడిపి పార్టీకి మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి కేవలం 23 సీట్లు మాత్రమే అందించారు. బాబు గత ప్రభుత్వ హయాంలో చేసిన పలు తప్పిదాల వలన కూడా మొన్నటి ఎన్నికల్లో ఊహించని విధంగా టిడిపి ఓటమి పాలయిందని కొందరు బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది. ఇకపోతే ఈ ఎన్నికల్లో 151 సీట్లతో దిగ్విజయంగా ప్రజల మెప్పుతో గెలిచి వైసిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించారు. 

 

ఇకపోతే ఓటమితో టీడీపీ పార్టీ చాలా వరకు కుదేలవడంతో బాబు సహా పలు కీలక నేతలు సైతం ఆలోచనలో పడ్డారు. ఇక సీఎం గా జగన్ పాలన మొదలెట్టి, ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు మాత్రం జగన్ పై అలానే ఆయన ప్రభుత్వంపై విషం చిమ్ముతూనే ఉన్నారు. గతంలో రాజధాని అమరావతి పేరుతో భూముల దందా చేసి వేలకోట్లు వెనకేసుకోవాలని చూసిన బాబు కుయుక్తులకు మొన్న జగన్ ప్రకటించిన మూడు రాజధానుల అంశంతో ఒక్కసారిగా అడ్డుకట్ట పడింది. ఇక నేటితో మూడు రాజధానులు క్యాబినెట్ ఆమోదం లభించడంతో బాబు సహా ఆ పార్టీ శ్రేణులందరూ గుటకలు మింగుతున్నారు. 

 

ఇప్పటికే బాబు పని అయిపోయిందని, కావున ఇకపై పార్టీ పనులను కొడుకు లోకేష్ కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కోడలు బ్రాహ్మణి, భార్య భువనేశ్వరిల ఒత్తిడితో కొడుకుని అడ్డదారిలో ఎంఎల్సీ ని చేసిన బాబు, అప్పట్లో ఒక్క రాజధాని ఉన్న సమయంలోనే పార్టీని సక్రమంగా ముందుకు నడపలేకపోయారని, ఇకపై రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు కావడంతో మూడు ప్రాంతాల్లో పార్టీని సమర్ధవంతంగా నడిపే పరిస్థితి లేదని అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పప్పుకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే, ఇప్పటికే పార్టీలో మిగిలిన అరకొర నాయకులు కూడా బయటకు వెళ్ళిపోతారనే భయం కూడా బాబును వెంటాడుతోందని, ఈ విషయమై బ్రాహ్మణి కూడా కొంత బెంగగా ఉందని సమాచారం. నాడు అర్హతలేని భర్తకు ఎంఎల్సీ పదవి లభించేలా ఒత్తిడి తెచ్చిన బ్రాహ్మణి, నేడు బెంగపడక తప్పట్లేదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: