ఇవాళ ఏపీ శాసనమండలిలో ఇవాళ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశ పెట్టింది. ఇప్ప‌టికే ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇక అందరి చూపు మండలిపై ప‌డింది. ఎలాగైనా మూడు రాజధానుల బిల్లుని ఆమోదింప చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్. మ‌రోవైపు టీడీపీ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  దీంతో అధికార పక్షం, టీడీపీ సభ్యుల మద్య తీవ్రస్ధాయిలో వాదోపవాదాలు జరిగాయి. అయితే మండలిలో టీడీపీకి మెజార్టీ ఉండటంతో... బిల్లు ఆమోదం కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో సభ్యుల సంఖ్య 58 కాగా, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 

 

ఈ నేపథ్యంలో బిల్లు పాస్ కావడానికి 28 మంది సభ్యుల బలం అవసరం. మ‌రి టీడీపీ, వైసీపీ బ‌లాబాలు చూస్తే..  ఏపీ మండలిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. మండలిలో వైసీపీకి త‌క్కువ మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వైసీపీ కంటే టీడీపీ చాలా బలంగా ఉంది. అంటే టీడీపీ బలం 28 అయితే.. అధికార వైసీపీ సభ్యుల బలం 9 మంది సభ్యులు మాత్రమే. అయితే గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కంతేటి సత్యనారాయణ రాజు వైసీపీలోనే ఉన్నారు. దీంతో ప్రభుత్వ బలం 10గా ఉంటుంది. అయితే టీడీపీకి మండలిలో 32 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ప్రభుత్వానికి ఈ బిల్లుల్ని పాస్‌ చేయించుకోవడం కత్తిమీద సాములా మారింది.

 

అయితే ఇక్కడ‌ మ‌రో విశేషం ఏంటంటే.. మరో ఇద్దరు స్వతంత్ర సభ్యలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. టీచర్స్ ఎమ్మెల్సీలు ఐదుగురు ఉన్నారు.  వీరిలో ఎవరూ కూడా మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ మాట్లాడలేదు. వీరంతా కూడా ప్ర‌భుత్వానికి ఓటు వేసే ఛాన్స్ ఉంది. మ‌రోవైపు ఆదివారం టీడీఎల్పీ నిర్వహించిన సమావేశానికి.. 12 మంది ఎమ్మెల్సీలు హాజ‌రుకాలేదు. దీంతో టీడీపీకి ఎక్క‌డ‌లేని క‌ల‌వ‌రం మొద‌లైంది. అయితే ఏం జరుగుతుందనేది మాత్రం ఆసక్తిదాయకమే. మండలిలో ఈ బిల్లు ఆమోదం పొందకపోయినా.. దాన్ని అమలు చేయడానికి శాసనసభకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: