దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు నేనే... రాజకీయాల్లో నా కంటే తోపు ఎవ్వరు లేరు.. నేను చెప్పిందే శాసనం... అంటూ 2014 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జబ్బలు చరుచుకున్న  చంద్రబాబు నాయుడు... పరిస్థితి ఏమైంది. ఎంత 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంటే మాత్రం... ఎలాంటి హామీలు నెరవేర్చకుండా... ప్రజలను మోసం చేస్తూ ఉంటే ప్రజలు ఊరుకుంటారు  అనుకున్నారా చంద్రబాబు గారు అంటూ... 2019లో ఏపీ ప్రజలు అందరూ టిడిపి పార్టీ ని ఎన్నడూ లేనివిధంగా ఇరవై మూడు సీట్లకే పరిమితం చేసి ఘోర ఓటమి కట్టబెట్టారు. దీంతో రాజకీయాల్లో తన కంటే సీనియర్ ఎవరూ లేరు... నేను యమ గ్రేట్ అని  చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో మాత్రం ఘోర ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల తర్వాత జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నా ఉన్నాయి. 

 


 రాష్ట్రంలో టీడీపీ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. పార్టీ నుంచి కీలక నేతలు అందరూ వీడి పోతుండడం పార్టీ నుండి రాజీనామా చేసి చంద్రబాబు పైన విమర్శలు చేస్తుండడం... అటు అధికార పార్టీ నేతలు కూడా చంద్రబాబు పై విమర్శలు చేస్తూ చంద్రబాబు గతంలో చేసిన అవినీతిని ఎండగడుతూ ఉండటం చేస్తున్నారు. అయితే జగన్ సర్కార్ పై ఎక్కడ వ్యతిరేకత తెచ్చేందుకు చంద్రబాబుకు అవకాశం దొరకలేదు. కానీ తాజాగా జగన్ సర్కార్ నిర్ణయాన్ని అమరావతి రైతులు వ్యతిరేకిస్తూ నిరసన తెలపడంతో అదే అదనుగా భావించిన చంద్రబాబు నాయుడు రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ జగన్ సర్కార్ పై వ్యతిరేకత తీసుకురావాలని బాగానే ట్రై చేశారు... అయితే ఒక్క అమరావతి లోనే కొన్ని గ్రామాల ప్రజలు జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఉన్న మిగతా రాష్ట్రం మొత్తం ప్రజలు మాత్రం జగన్ కు జై కొడుతున్నారూ. 

 


 ఇక గతంలో హైదరాబాద్ నగరాన్ని నేనే కట్టించాను.. అందరికీ రాజకీయాలనే నేర్పాను అంటూ గొప్పలు చెప్పుకుని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్విజర్లాండ్ రాజధాని లో దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు చంద్రబాబు . ఇకపోతే ఈ ఏడాది మళ్లీ జరిగే ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబుకు మాత్రం అవకాశం లేనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే జగన్ సర్కార్ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించడం సిబిఐ విచారణ చేపడతామని తెలపడం... ఇలాంటివే ఇందుకు కారణం. ఒకవేళ జగన్ సర్కార్ నిజంగానే సిబిఐ విచారణ చేపడితే మాత్రం చంద్రబాబు విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉండదు. నిజంగానే ఈ విచారణ ఇప్పటికికిప్పుడు స్టార్ట్ అయింది అనుకొండ చంద్రబాబుకు వారం రోజుల పాటు నిద్ర ఉండదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: