నేడు రెండవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు కూడా టిడిపి నేతలు అందరూ ఆందోళనలు చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అయితే టీడీపీ నేతల తీరుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... దాదాపు మూడు గంటల నుండి చూస్తున్నాను అధ్యక్ష అసెంబ్లీలో టీడీపీ నేతలు స్పీకర్ పోడియం వద్దకు  వస్తున్నారు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు... స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఎందుకు వస్తున్నారో.. జై అమరావతి అని ఎందుకు అంటున్నారో  టిడిపి నేతలకు కూడా తెలియదు అని ఆరోపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు ఎస్సీ ఎస్టీల ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయడం కోసం ఒక చారిత్రాత్మకమైన బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెడుతుంటే  టిడిపి నేతలు ఈ బిల్లును అడ్డుకుంటూ  జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు. 

 


 ఇలాంటి హీనమైన చరిత్ర ఈ దిక్కుమాలిన టిడిపి పార్టీకి టిడిపి ఎమ్మెల్యేలకు అధినేత చంద్రబాబుకు తప్ప ఇంకా ఎవరికీ ఉండదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఆ బిల్లు కౌన్సిల్ ఆమోదం పొందకుండా అడ్డుకున్నారు... మరోవైపు మళ్లీ ఇటువంటి దిక్కుమాలిన  ఆలోచనలతో అసెంబ్లీకి  వస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే లు ఏమైనా మాట్లాడటం మొదలుపెడితే చాలు టిడిపి నేతలు అందరూ అరుస్తున్నారు.. ఇది అసెంబ్లీ అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చర్చ జరగనీయకుండా ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు టిడిపి ఎమ్మెల్యేలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొట్టమొదటిసారిగా ఎస్సీలకు 3 కార్పొరేషన్ లు  ఏర్పాటు చేయడం... ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుంటే  టిడిపి నేతలు మాత్రం దానిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 

 


 గతంలో తమ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఎన్నడూ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ ఎస్టీలకు ఆరు మంత్రి పదవిలు  ఇచ్చాము  అంటూ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇలాంటి చారిత్రాత్మకమైన బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెడుతూ ఉంటే టిడిపి నేతలు అడ్డుకోవడం నిజంగా దారుణం అంటూ విమర్శించారు. ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయడం చంద్రబాబుకు ఇష్టం లేక తమ ఎమ్మెల్యేలతో  బిల్లును అడ్డుకోవాలంటూ ఇలా ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు

మరింత సమాచారం తెలుసుకోండి: