ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా 3 రాజధానిల  ప్రకటన ఆంధ్ర రాజకీయాలని  ఒక్కసారిగా వేడెక్కించిన  విషయం తెలిసిందే... అయితే విపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన... రైతులు ఎన్ని నిరసనలు ధర్నాలు చేపట్టిన.. మూడు రాజధానుల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా... అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించినది  జగన్ సర్కార్. ఇకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి  మూడు రాజధానిల ప్రకటించగానే అమరావతి రైతులు అందరూ నిరసన బాట పట్టిన విషయం తెలిసిందే. తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపడుతూ... జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటి వరకూ అమరావతి లో రైతులు నిరసన ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపారు. 

 


 ఇక ఈ లిస్ట్ లోకి మరో పార్టీ వచ్చి చేరింది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అని అందరూ అనుకుంటున్న తరుణంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏపీ కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడు నియమించిన విషయం తెలిసిందే. శైలజానాథ్ ను  ఏపిసిసి పదవిలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఇకపోతే తాజాగా మూడు రాజధానిల నిర్ణయం పై స్పందించిన కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్  తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి లో రైతులు నిరసన లకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా రైతులు చేస్తున్న ఉద్యమంలో పాల్గొంటారు అని ఏపీసిసి అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. 

 

 ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన ఆరోపించారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో నిరసనలు చేపడుతున్న రైతులతో జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రవర్తిస్తున్న తీరు ఎంతో దుర్మార్గంగా ఉంది అంటూ విమర్శించారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణరహితంగా దాడులు చేయడం... లాఠీ ఛార్జీలు చేయడం దుర్మార్గమైన చర్య అని శైలజానాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించిన ఆయన... జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటన ముమ్మాటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదు అంటూ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తాము పోరాడుతామని అంటూ తెలిపారు శైలజానాథ్.

మరింత సమాచారం తెలుసుకోండి: