జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. పదవి లేకపోతే ఏంటి ప్రజల తరఫున పోరాటానికి ధైర్యం ఉంది అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాడుతున్నారు పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష పార్టీ కంటే ఎక్కువగా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంగళగిరిలో మీడియో సమావేశం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు అంతులేకుండా పోయింది అంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 

 


అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరంకుశ ధోరణి లో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షలను పక్కన పెట్టేసి... నిరంకుశంగా వ్యవహరిస్తుందని అంటూ విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి సర్కారును కూల్చేంత  వరకూ తాను నిద్రపోను అంటూ శపథం  చేశారు పవన్ కళ్యాణ్. వైసీపీ వినాశనం మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు జనసేనాని. అమరావతి నిర్మాణం కోసం భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం... భూములను త్యాగం చేసిన ఆడపడుచుల చేత జగన్ సర్కార్ కన్నీరు పెట్టించినదని ... అమరావతి ఆడపడుచుల శాపాలు ఊరికే పోవు అంటూ జగన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.

 

 ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు చేయాలని మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని... పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అందరూ తీసుకుంటున్న నిర్ణయాలు... వారి భవిష్యత్తు వినాశనం కోసమే అంటూ హితవు పలికారు పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీకి ఇదే తొలి చివరి అధికారం అంటూ వ్యాఖ్యానించారు. ఇకపై జగన్మోహన్ రెడ్డి కి రాష్ట్రంలో అధికారం ఉండదు అంటూ తెలిపారు. రాజధాని అమరావతి నుంచి ఎవరు తరలించ లేరు అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: