అన్న ఎన్టీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన తెలుగు దేశం పార్టీ చంద్రబాబు చేతిలోకి వచ్చాక క్రమ క్రమంగా క్షీణిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడప్పుడు ఇతర పార్టీల మద్దతుతో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ... చంద్రబాబుకు మాత్రం క్రమ క్రమంగా ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతోనె  వచ్చింది. 2014లో కూడా జనసేన పార్టీమద్దతుతో  అధికారం చేపట్టిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు అందరూ గట్టిగా బుద్ధి చెప్పారు. టిడిపి ఎప్పుడూ చూడని ఘోర పరాభవాన్ని 2019 ఎన్నికల్లో చవిచూస్తుంది. 2019 ఎన్నికల్లో టిడిపి పార్టీ గెలుచుకున్న 23 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి చంద్రబాబు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

 అయినప్పటికీ టీడీపీ లోకి కీలక నేతల్లో కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు పార్టీ మారాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సీఎం జగన్ నిబంధన పెట్టడం వల్ల టిడిపి నుంచి ఎవరు వెళ్లకుండా ఆగారు కానీ లేకపోతే అందరూ వైసీపీ లోకి వచ్చేవారు అన్నది అందరు  అనుకుంటున్న మాట. ఇక టీడీపీ పార్టీకి పూర్వవైభవం తీసుకొద్దాం అంటే చంద్రబాబుకు అంత వయస్సు కానీ ఓపిక కానీ లేవు. ఇక పార్టీని ముందుండి నడిపించడం కూడా అంత సులభమైన పనికాదు. ఇప్పటికే అమరావతిని తన శ్వాసగా చెప్పుకుంటున్న చంద్రబాబు అమరావతిని కూడా నిలబెట్టుకోలేక పోయారు. న టిడిపికి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలను కూడా ఒక తాటి పైకి తీసుకు రావడంలో చంద్రబాబు విఫలం అయ్యారు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. 

 

 ఈ క్రమంలో పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తే తప్ప పార్టీకి పూర్వవైభవం రాదు అన్నది అందరూ అనుకుంటున్న మాట. మరి ఈ కొత్త అధ్యక్షుడు ఎవరు అన్నది కూడా ప్రస్తుతం అందరిలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కైతే పార్టీని నడిపించే సీన్ లేదు.. ఇక చంద్రబాబు అల్లుడు అయిన శ్రీ భరత్ పార్టీ పగ్గాలు చేపడతారా అని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ... అమరావతి మార్పు  విషయంలో శ్రీ భరత్  చంద్రబాబుకు వ్యతిరేకంగానె  స్వరం వినిపించారు. మరోవైపు  తెలుగు తమ్ములు అందరూ పార్టీ పగ్గాలను ఎన్టీఆర్ చేతుల్లోకి రావాలని కోరుకుంటున్నా.. ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. మరి ఇలాగే చంద్రబాబు హయాంలో పార్టీ ముందుకు సాగితే మాత్రం.. పార్టీ పరిస్థితి మరింత అద్వానంగా తయారయ్యే అవకాశం ఉంది. మరి చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలను ఎవరు స్వీకరిస్తారు అన్నది ప్రస్తుతం తెలుగు తముళ్ల లో నెలకొన్న ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి..?

మరింత సమాచారం తెలుసుకోండి: