రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం మూడు రాజధానిలు  ఏర్పడితే ఒకే చోట అభివృద్ధి కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందని భావించిన జగన్ సర్కార్ మూడు రాజధానిల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే మూడు రాజధానిల  ప్రకటన చేసినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. అటు రాజధాని అమరావతి లో కూడా రైతులందరూ జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు రాస్తారోకోలు చేపట్టారు. ఇక విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా రైతులు ఎంతలా నిరసనలు చేపట్టిన జగన్ సర్కారు మాత్రం మూడు రాజధానిల విషయంలో వెనక్కి తగ్గకుండా అసెంబ్లీలో 3 రాజధాని లకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేసింది. ఇక నేడు మూడు రాజధాని లకు సంబంధించిన బిల్లు శాసన మండలికి వెళ్ళింది. 

 


 అయితే కర్నూల్ లో న్యాయపరమైన రాజధాని.. అమరావతి లో చట్టసభల రాజధాని... విశాఖపట్నం లో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందని నిర్ణయించింది జగన్ సర్కార్. అంతే కాకుండా లక్ష కోట్ల రూపాయలను కేవలం అమరావతి లోనే ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల అభివృద్ధి జరగవు అని భావించి ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ నిర్ణయంపై విపక్ష పార్టీలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి అభివృద్ధి చేయడం చేతకాక... జగన్మోహన్ రెడ్డి సర్కార్ 3 రాజధానిల అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇకపోతే తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానిల నిర్ణయం పై తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా తోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  3 రాజధాని ఏర్పాటుకు... సిద్ధమయ్యారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు
 ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండటం తన రాజకీయ జీవితంలోనే ఎప్పుడూ చూడలేదు అని వ్యాఖ్యానించిన హనుమంతరావు... దీనిపై కేంద్రం స్పందించాలి అంటూ తెలిపారు. అమరావతి అభివృద్ధి చేయడానికి నిధులు లేవు అంటూ చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను నిర్మించడానికి మాత్రం నిధులను ఎక్కడి నుంచి తీసుకు వస్తారూ  అంటూ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: