పుట్టింటోళ్ళు తరిమేశారు ... కట్టుకున్నోడు వదిలేసాడు... పట్టుమని పదహారేళ్లు లేవురా ..! నాసామి కట్టుకుంటే మూడు ముళ్ళు రా ...అంటూ తెలుగుదేశం పార్టీని చూసి కొంతమంది పాటలు పడుకుంటున్నారు. అసలు బాబు చేసిన తప్పిదాల కారణంగానే కదా ఆయన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. రాజధానిగా అమరావతి ఒక్క ప్రాంతం తప్ప మిగతా ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందినా చెందకపోయినా ఫర్వాలేదు అన్నట్టుగా అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు భావించబట్టే టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఎప్పుడు రానంత ఘోరాతి ఘోరంగా స్థానాలు దక్కాయి. అసలు తాను ఎందుకు ఓడిపోయానో తెలియక చంద్రబాబు ఇప్పటికీ జుట్టు పీక్కుంటూనే ఉన్నాడు. బాబు ప్రేమంతా ఒక్క అమరావతి మీదే పెట్టడంతో అసలు చిక్కంతా వచ్చి పడింది. 

 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి లో రాజధాని నిర్మాణం చెప్పడం కంటే మూడు ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని చెప్పినా ... బాబు మాత్రం పసి పిల్లాడిలా మారం చేస్తూ తాను అమరావతిని తప్ప మిగతా ఏ ప్రాంతాన్ని రాజధానిగా ఒప్పుకోను అంటూ హడావుడి చేస్తున్నాడు. బాబు తీసుకున్న ఈ వ్యూహాత్మక తప్పుడు నిర్ణయంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పార్టీ పరిస్థితి మరింతగా దిగజారినట్టు లెక్కలు చెబుతున్నాయి.

 

ఇప్పుడు ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులు జనల మధ్యకు వచ్చి ఏ విధంగా స్పందించాలో తెలియక సతమతం అయిపోతున్నారు. ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాకుండా కేవలం ఒక్క ప్రాంతం మీదే ఫోకస్ పెట్టమని, దీని కారణంగా మిగతా రెండు ప్రాంతాల్లో పార్టీ పూర్తిగా దెబ్బతింది అనే బాధ టీడీపీ నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.     

 

విశాఖలో పరిపాలన రాజధాని, రాయలసీమలో హైకోర్ట్ ఏర్పాటు చేస్తుంటే టీడీపీ అడ్డుకుంటుంది అనే భావన అక్కడి ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయిందని ఇప్పుడు తాము తలెత్తుకుని జనాల్లోకి వెళ్లి ధైర్యంగా మాట్లాడలేని పరిస్థి ఉందని, ఇదంతా తమ అధినేత చంద్రబాబు చేసిన తప్పిదమే అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో టీడీపీకి ఇక గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

 

విశాను పరిపాలన రాజధానిగా చంద్రబాబు గట్టిగా వ్యతిరేకించిన కారణంగా ఇక అక్కడ బాబు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అలాగే బాబు వ్యవహారం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇక టీడీపీకి గడ్డు పరిస్థితులే ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు పుణ్యమే అంటూ కొంతమంది టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: