అయ్యో అయ్యో అయ్యోయో.. చంద్రబాబు. ఎంత కష్టం వచ్చిందయ్యా నీకు.. నిన్ను చూస్తుంటే చాలా బాదేసేస్తుందయ్యా.. నువ్వు ఎంత 5 ఏళ్లలో ప్రజలను దోపిడీ చేస్తే మాత్రం నీకు ఇంత దారుణమైన శిక్ష వేస్తాడా దేవుడు.. అప్పుడెప్పుడో మామని మంచాన పడేస్తే దేవుడు ఇప్పుడు శిక్ష విదిస్తాడా? నీకు ? ఎంత దారుణం అయ్యా!

 

నువ్వు ఎంత మోసగాడు అయితే మాత్రం ప్రజలు నిన్ను ఆలా తరిమితరిమి కొడుతారు.. అయ్యో చంద్రబాబు! అందుకే చంద్రబాబు.. నీకంటే వయసు తక్కువైనా.. నీలా నరరూప రక్షేశుడు కాకపోయినా.. రాజకీయ అనుభవం లేకపోయినా ఎవరిని తక్కువ అంచనా వెయ్యకూడదు.. అలా తక్కువ అంచనా వేస్తేవి.. 2019లో గెలుపు మనదే అంటివి.. అటుపక్క పార్టీ పెట్టినప్పటి నుండి పని చేసినవారిని నీ పార్టీలోకి లాక్కుంటివి.. చివరికి ఏమైంది ? ఘోరాతి ఘోరంగా 2019 ఎన్నికల్లో ఓడిపోతివి.. 

 

ఓడిపోయినా నువ్వు.. ప్రతిపక్ష ప్రతినిథిగా ఏమైనా నీ పని సరిగ్గా చేశావా ? అంటే చెయ్యలేదు. సరిగ్గా నీ పార్టీలో నాయకులను కూడా కాపాడుకోలేక పోతున్నావు.. అందరిని పోగొట్టుకుంటున్నావు. నీ పార్టీ నాయకులే పాలకపక్షానికి.. మద్దతు ఇస్తున్నారు. సీఎం జగన్ తెచ్చే అన్ని పథకాలను స్వాగతిస్తున్నారు.. నువ్వు ఎంత రచ్చ చేసిన సరే.. వాళ్ళందరూ వాళ్ళకే మద్దతు పలికితిరి.    

 

ఇప్పుడే ప్రతిపక్షంలో విఫలమయ్యారు అంటున్నారు.. సీఎం జగన్ చేసే మంచి.. నువ్వు చేసే గొడవలు చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఇంకా 2024లోను ప్రతిపక్ష హోదానే అంటున్నారు... వైసీపీ దూకుడు ముందు టీడీపీ నిల‌వ‌లేక పోతోంది అని.. ప్ర‌జ‌ల్లోనూ ఇదే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోందని విశ్లేషకులు చెప్తున్నారు.. ఇంకా 2024లో ఓడిపోతే 2026కు అంత పార్టీ కనుమరుగవుతుంది అని.. సీఎం జగన్ ప్రతిపక్షమే లేకుండా చేస్తారని విశ్లేషకులు చెప్తున్నారు.. ఇంకా ఇది అంత చూస్తే నిజంగానే ఏ ఎన్టీఆర్ ఓ వచ్చి తాత పార్టీ అని కాపాడితే తప్ప టీడీపీ ఉండదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చంద్రబాబు పరిస్థితి ఏమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: